శృతి చేసిన అక్షర నాదం – ఎల్లా వెంకటేశ్వరరావు

‘శృతి’ తప్పని ఆయన మృదంగవాద్య సంగీతం ప్రేక్షకుల హృదయాలను ‘లయ’ తప్పిస్తుంది. జేఎన్టీయూ నుంచి డాక్టరేట్ పొంది తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా, డీన్‌గా పనిచేసి ఎన్నో కోర్సులను ప్రవేశపెట్టి, ఆ యూనివర్సిటీ బహుముఖ విస్తృతి కావడానికి కారకులైన ఎల్లా వేంకటేశ్వరరావుకు ప్రాథమిక విద్య కూడా లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. మృదంగ వాయిద్యంలో అంతర్జాతీయ ఖ్యాతిపొందిన ఆయన ఏడేళ్ళ వయసు నుంచే కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. దానితో చిన్నతనంలో స్కూలుకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఆయన డిగ్రీ చేయాలన్న కోరికను అంబేడ్కర్ యూనివర్సిటీ నుంచి తీర్చుకున్నారు. ఆయన సరిగమల స్వరాల మధ్య అక్షర నారాన్ని విందాం.
నేను, నా భార్య… అంబేద్కర్ వర్సిటీ
ఏడవ ఏట నుంచే కచేరీలు మొదలు పెట్టిన నాకు చదివే తీరిక ఎక్కడిది.సంగీతమే లోకం, సినారే, ఎన్టీఆర్ లాంటి పెద్దవారిని కలిసినప్పుడు వారు సూచించారు. మీకు డిగ్రీ లేనిలోటు ఎందుకు? అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో చేరమని ప్రోత్సహించారు. కచేరీలకు, సంగీత సేవలకు ఆటంకం ఉండరన్న ధైర్యంతో అంబేద్కర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశా. నాతో పాటు మా ఆవిడ కూడా ప్రవేశ పరీక్ష రాసింది. ఇద్దరం బీఎ లో చేరాం. నా డిగ్రీ చేయాలన్నకల అక్కడే నిజమైంది. నిజానికి నాలాంటి వారికి ఇలాంటి యూనివర్సిటీ తప్ప వేరే దారి లేదు. అనేక మంది కలలను ఈ యూనివర్సిటీ నిజం చేస్తోంది.
Media Attributions
- venkateswararao