20 ఆత్మవిశ్వాసమే ఆయన ఆయుధం
దూరమైన బడి…
తనకి ఇన్స్ట్రక్టర్ ఉద్యోగం రావడంతో మా మకాం విజయవాడకు మారింది. నాన్నకు చదువంటే మహా ఇష్టం, గౌరవం. మమ్మల్ని బాగా చదివించాలని తాపత్రయపడేవాడు. విజయవాడలో తమ్ముళ్ళతో పాటు నన్ను స్కూలుకు పంపారు. క్రీస్తురాజుపురమనే ఆ ప్రాంతంలోని బడి ఓ కొండపై ఉండేది.మోకాళ్ళు వంగని కాలిపర్స్ వికలాంగులు వాడే ప్రత్యేక బూట్లు) వేసుకుని,చంకలో కర్రలు పెట్టుకుని వెళ్ళేవాణ్ణి. ఆ బడిలో బెంచీలు లేవు. కిందే కూర్చునేవాణ్ణి. ఫైకి లేవడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది. నా శ్రమను గమనించిన టీచర్ “ఇంత కష్టపెట్టి ఈ పిల్లాడిని స్కూలుకు పంపకంది.. కిందపడి ఏదన్నాజరిగితే ఇంకా ప్రమాదం” అని అమ్మానాన్నను హెచ్చరించింది. అంతే… ఆ రోజుతో స్కూలు జీవితం ముగిసిపోయింది.
పుస్తకాలతో స్నేహం
నన్ను ఇంట్లోనే ఉంచి చదివించడానికి నిర్ణయించారు. అంగ వైకల్యం జీవితాన్ని ఎంత దుర్భరం చేస్తుందో తెలిసివచ్చింది. నా దృష్టంఠా తోటి పిల్లలు ఆడుకునే ఆటల అండ్ నేను వెళ్ళలేని ప్రదేశాల మీదే. తమ్ముళ్ళు పుస్తకాలు తెచ్చి ఇచ్చి చదవమనేవారు. స్వయంగా చదివితే సరిగ్ అర్థమయ్యేవీ కావు ముఖ్యంగా లెక్క లంటే భయం కూడా. కానీ, చదవాలన్న ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం పెరుగుతూనే ఉంది. పాఠ్య పుస్తకాలపై మనసు పోయేదికాదు కానీ, కాల్పనిక సాహిత్యం బాగా చదివేవాడిని. పుస్తకం దొరికితే ఆనందమే. అది తెలుగు పుస్తకం అయితే చాలు. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ చేతుల్లో పుస్తకం ఉండేమోనని చూసేవాడిని.
. వేదాలలో ఏమున్నది? నిత్యజీవితంలో భౌతికశాస్త్రం… ఇలాంటి వైవిధ్యమైన పుస్తకాలు ఇచ్చేవారు. ఆలోచనలు అస్తవ్యస్థంగా ఉండ కూడదని, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పే మాస్టారు నా దృక్పథంలో మార్పుకు కారణం అయ్యారు. న్యూటన్న ఆరేసిన నా వ్యక్తిత్వం చిగురు తొడగడం ప్రారంభించింది. దానికి తోడు సి.నరసింహారావు ‘రేపు’ మాసపత్రిక నన్ను ప్రభావితం చేసింది.
అసహాయత, అక్షరాలు….
అపట్లో నా ఆలోచనలో స్పస్తత ఉండేది కాదు. కొంచెం సున్యత మరియు కొంచెం ఉత్సాహం, ఏది అయిన సాధించాలన్న తపన, కానీ సహకరించని శరీరం… వీటిమధ్య ఆలోచనలు అస్తవ్యస్థంగా ఉండేవి. చిత్ర లేఖనం నేర్చుకోవడానికి ప్రయత్నించాను. చుట్టు పక్కల వారినుంచి విమర్శలే ఎదురయ్యాయి. జన్మతః రావాలని కొందరు, బొమ్మలు తో ప్రయోజనం ఏంటి
అని మరికొందరు ఉత్సాహంపై నీళ్ళు చల్లేవారు. పుస్తకాలు చదువుతుంటే నాకు
రాయాలని ఉండేది. కానీ, రాయడం మొదలుపెడితే అన్నీ అనుమానాలే. అప్పుడప్పుడు నా ఆలోచనలన్నీ అత్యాశలుగా అనిపించేవి. “చేయగలిగింది ఏమీ లేదు… దొరికిన జీవితాన్ని అనుభవించడం తప్ప” అనే నిస్పృహ, రాజీ ధోరణి. ఎటూ తేల్చుకోలేని అసహాయత. పుస్తకాలు చదవడం కన్నా ఏమీ చేయ లేనేమో అనుకునే వాడిని. మా తమ్ముళ్ళకు అండ నాకు“అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ పునర్జన్మ నిచ్చింది. వికలాంగుడిగా ఆత్మ సున్యతతో
కొట్టుకుని పోతున్న నన్ను లేపి నిల్చోబెట్టింది. వైకల్యంతో ప్రకృతి నన్ను విమర్శిస్తే… నా
విద్యావ అవకసాలను తొల్లగొడితే యూనివర్సిటీ వీటిని తిరిగి నా దగ్గరికి చేర్చింది. నేను డిగ్రీలో చేరినప్పుడు ‘ఈ చదువు ఉపయోగపడుతుందా…’ అని పెదవి విరిచారు. కానీ, ఏ ఇంటర్వ్యూలోనూ నాకా ఆప్రశ్న ఎదురు కాలేదు.” పుస్తకాలు చదివే అలవాటు లేకపోయినా నా కోసం లైబ్రరీ నుంచి తెచ్చేవాళ్ళు, పెద్ద తమ్ముడు మోహన్ నుంచి ఈ విషయంలో చాలా సహకారం ఉండేది. కప్ప గంతుల మల్లికార్జునరావు స్పానిష్ పోరాట కథ .అనువాదం ..
నగ్నసుందరి, జాక్ లండన్ ‘ప్రకృతి పిలుపు’ నాపై చాలా ప్రభావం చూపాయి.