"

36 దర్జీ కుటుంబంలో చదువుల దర్జా – వెంకటేశ్వర్లు

ఈశ్వర్ సోదరుడైన వెంకటేశ్వర్లు దేవరకొండలో ఇంటర్ చేస్తుండగా ఆర్మీసెలక్షన్లకు నోటిఫికేషన్ పడింది. అసలే ఆర్ధిక సమస్యలు, తండ్రికి భారం కాకూడదనే ఉద్దేశంతో చదువుని పక్కన పెట్టి ‘ఆర్మీ’లో చేరారు. కనీసం డిగ్రీ అయినా చేయాలని తన కోరిక అంటారాయన. ఉద్యోగంలో చేరడం తన కోరిక అంబేద్కర్ ఓపెన్వర్సిటీ గురించి తెలుసుకుని డిగ్రీలో చేరారు. నల్లగొండలోని నాగార్జున కాలేజీలో స్టడీసెంటర్, ఆర్మీ సర్వీసు కొనసాగిస్తూనే సెలవులు ఉపయోగించుకుని డిగ్రీ పూర్తిచేశారాయన. ఈ డిగ్రీ ఉద్యోగంలోప్రమోషన్లకు ఉపయోగపడిందని వెంకటేశ్వర్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కికృతజ్ఞతలు చెబుతున్నారు. అయితే అక్కడితో ఆగకుండా అంబేద్కర్ ఓపెన్వర్సిటీలోనే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసాడు. త్వరలోనే తాను మిలటరీ సర్వీసు నుంచి రిటైర్ అవుతున్నానని తర్వాత ఉద్యోగాలకు తన డిగ్రీలు ఉపయోగపడతాయన్న ఆనందాన్ని వెంకటేశ్వర్లు వ్యక్తం చేస్తున్నారు.

దర్జీ కుటుంబంలో చదువుల దర్జా – వెంకటేశ్వర్లు

Media Attributions

  • venkateswarlu

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.