దర్జీ కుటుంబంలో చదువుల దర్జా – ఈశ్వర్, వెంకటేశ్వర్లు

ఇల్లంతా దులిపినా చిల్ల గవ్వ రాలని పరిస్థితి. నోట్బుక్స్ కొనే అవకాశం లేని ఆర్థిక స్థితిగతులు, స్కూలుకు వెళ్ళాలంటే మైళ్ళకొద్దీ నడక. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాథమిక విద్యే భారం. మామూలు దర్జీ కుటుంబంలో పుట్టిన ఈశ్వర్ అననుకూల పరిస్థితుల్లో టెన్త్ గట్టెక్కి- ఆర్థిక సమస్యల కారణంగా ఇంటర్ తప్పి ఒక చిన్న ఉద్యోగంలో సెటిలయ్యాడు. ఇక చదువు, ఉద్యోగం ఇంతే అని సరిపెట్టుకున్న సమయంలో అంబేద్కర్ యూనివర్సిటీ అతనికి అండగా విలిచింది. కుటుంబ సాయానికి అనివార్యమైన ఉద్యోగ బాధ్యతలకు ఆటంకం కలగకుండా ఈశ్వర్ డిగ్రీ పూర్తి చేయగలిగారు. ఆ డిగ్రీ సాయంతో ప్రతిష్ఠాత్మకమైన డిఅర్ద్లో ఉద్యోగం సంపాదించగలిగారు. ఆ డిగ్రీ విలువ తెలుసుకున్న ఆయన తన సోదరులను కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో చేర్పించి వారు జీవితంలో స్థిరపడడానికి కారకుడయ్యారు.
Media Attributions
- eeshwar