"

31 ఆటో వాలా అధ్యాపకుడయ్యిందిలా

సాయిలు మామ… అంబేద్కర్ 

మా ఇంటి ఎదురుగా జయరాజ్ అని నాకు అన్నయ్య వరుస అవుతాడు. ఎమ్‌కాం చేసి ఆర్బీజీలో ఉద్యోగం సంపాదించాడు. ఇలాంటి వారికి ఆయన అదర్యం. కూలిపని చేసి చదువుకుని ఉద్యోగం సంపాదించిన ఆయనను చూస్తే పిల్లలకు ఆరాధన. నన్ను జయరాజ్ బాగా ప్రభావితం చేశారు. అలాగే నన్ను మార్చిన మరో మనిషి గురించి చెప్పాలి. ఆయనే సాయిలు. మామ అవుతాడు. గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేసేవారు. అంబేద్కర్ గురించి ఆయనే నాకు చెప్పాడు. చదువుకోసం అంబేద్కర్ చదివిన తన, కష్టం, ఎదుర్కొన్న అవమానాలు, దళితజాతి కోసం ఆయన పోరాటం .. ఇవన్నీ ఎంత బాగా చెప్పాడంటే మా ఊరి చెరువు సాక్షిగా మొదలైన నా మనసు కదలికలు ఇంకా అగేనే లేదు. బహుశా జీవితాంతం ఆ ప్రభావం ఉంటుందేమో. చెప్పడమే కారు. అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చాడు. పుస్తకాలు జీవితాన్ని మార్చుతాయని ఎవరైనా చెబితే దానికి ఉదాహరణ నేనెనంటాను. కులవ్యసనం, నిచ్చెన మెట్ల సమాజం, అంతరాణికనం, సామాజిక రుగ్మతలు, దళితుల దుర్భర జీవితం … ఇవన్నీ నా కళ్ళముందు గిన్నెర తిరిగాయి. నా జీవితంతో పోలిక ఉండవినీ చింది … ఆయన చరిత్ర చదువుతుంటే, అమితంగా ప్రభావితం చేసిన పుస్తకం అది. జీవన పరిస్థితులను మార్చుకోవడానికి చదునొక్కటే మార్గం అని మనసులో శిలాక్షారాలతో ముద్రపడడానికి కారణం అదే.

భూమయ్య మాస్టారు…

నేను పదో తరగతి చదివేటప్పుడు మాకు భూమయ్య మాస్టారు సాంఘిక శాస్త్రం చెప్పేవారు. చదువు చెప్పడమే కాదు… సాంఘిక సమస్యలపై దళితులలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు, ఉద్యమాలు చేసే వారాయన. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దళితవా డలో పుట్టిన నేను అక్షరజ్ఞానం అలవర్చుకుని అడుఅడు గుణ ఎదిగి ఈ స్థాయికి ఎలా, ఎవరి ప్రభావంతో వచ్చానో మీకు తెలియాలి. ఒక మాట, ఒక మనిషి, ఒక పుస్తకం జీవితాన్ని మార్చేస్తాయి. నేను అంబేద్కర్ యువజన సంఘంలో చేరినా, ఇంటర్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నా అది భూమయ్య మాస్టారు ప్రభావమే. అలాగే నాగేశ్వరరావు మాస్టారు కూడా తన విద్యతో, గానంతో విద్యార్థులను ఉత్తేజపరిచేవారు.

“చదువుకు ఇబ్బంది కాకూడదనుకున్నాను. అలాగే ఇంటికి ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించుకున్నాను. ఇదే లక్ష్యంతో ఆటో నడపడం నేర్చుకున్నాను. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాక ఆటో నడపడం, ఇంటికి వచ్చాక రాత్రి రోజు కనీసం గంటయినా చదువు. ఆదివారం మాత్రం అంబేద్కర్ వర్శిటీ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని. నిజంగా ఆ క్లాసులు విద్యార్థులకు ఒక వరం.”

 

కూలి పని… టెన్త్ పరీక్షలు

స్కూలుకు వెళ్తూనే వేసవి సెలవుల్లో అమ్మా నాన్నతో కూలికి వెళ్ళేవాడిని. మిరపకాయలు తెంపడం, వరి, జొన్న కోతలు… ఇలా ఏ పనైనా రడీ మా అమ్మతో కలిసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వేప చెట్ల దగ్గరి కెళ్ళేవాడిని,వేపకాయలు ఏరి, వాటిని శుభ్రం చేసి మార్కెట్లో అమ్మడం, వచ్చిన డబ్బులో నోట్బుక్స్, డ్రస్సులు కొనుక్కునే వాళ్ళం. టెన్త్ పరీక్షలప్పుడు సంగారెడ్డిలో సెంటర్. మా ఊరి నుంచి ఎగ్జామ్స్ రాయదానికి అక్కడికి వెళ్ళాలంటే ఒక్కో రోజు డబ్బులుండేవి కాదు. పొద్దున్నే లేచి నడిచే ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళేవాణ్ణి. నా ఇబ్బంది చూడలేక అమ్మానాన్న అప్పుచేసి డబ్బులు ఇచ్చారు. బస్సు చార్జీలు కూడా బరువే ఆ కాలంలో, టెన్త్ పరీక్షలయ్యాక సెలవుల్లో చక్కెర ఫ్యాక్టరీలో కూలి పని, ట్రాక్టర్పై ఇసుక, ఇటుక లేబర్ పని… మేస్త్రీ దగ్గర కూలి పని. ఇలా రకరకాల పనులతో కొంచెం డబ్బు పోగేశాను. ఇంతలో రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ క్లాసులో పాసయ్యాను. కాయలు కాచిన చేతులకు… పులిసిన ఒంటికి అదే ఓ ఔషధం అయింది.

ఇంటర్ ఫేయిల్

చిరిగిన దార్కాతో, కూలి డబ్బులతో టెంత్ మెట్ల ఎక్కాను. ఒక ఇంటర్… ఉన్న భారంపై మరో బరువు… నా స్నేహితుడి భరోసాతో ఎంపీసీలో చేరాను. అదే నేను చేసిన పొరపాటు. ఆర్ట్స్ గ్రూపులో చేరితే తేలిగ్గా గట్టేకవాడిని. భరోసా ఇచ్చిన స్నేహితుడు ఐటీ సీటు రావడంతో వెళ్ళిపోయాడు. నేను గడితం. భౌతికశాస్త్రం బుర్రకు ఎక్కక ఫెయిలయి కూర్చున్నాను, నిచ్చెన మెట్ల కింద నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.