"

3 ‘తెలుగు’ సంస్కృతిలో…

మాది అనంతపురం జిల్లాలోని లేపాక్షి అనే గ్రామం. చిన్న ఊరేకానీకృష్ణదేవరాయల సామ్రాజ్యపు స్మృతులు సజీవంగానే ఉన్నాయక్కడ. ఇక నాన్నతెలుగు లెక్చరర్, అష్టావధాని, పొరోహిత్యం చేసేవారు. తెలుగుభాష, సంస్కృతిసంప్రదాయాలు, చారిత్రక చిహ్నాలమధ్య పెరిగాను. అట్లా పెరిగిన నాకు…ఇంగ్లీషు మాధ్యమం నా జీవితాన్ని ఎలా మార్చేసిందో, ఫెయిల్యూర్స్కూ,సక్సెస్కూ దారితీసిందో చెబుతాను. ఎలిమెంటరీ స్కూలు, జిల్లా పరిషత్హైస్కూల్లో కూడా చదువు బాగానే సాగింది. టాప్ ఫైవ్లో ఉండేవాడిని. కనుకచదువు ఇబ్బంది అని గానీ, వెనుకబడి ఉన్నాం అని గానీ ఎప్పుడూ అనిపించలేదు. లెక్చరర్ తొడుకుగా గుర్తింపు. బాగా చదువుతాడని, సిన్సియర్గా ఉంటాడని పేరు. నాన్న తెలుగు లెక్చరర్ కనుక సహజంగానే నాకు తెలుగుపైఅమితమైన ఆసక్తి. ప్రాణం అనవచ్చు. హిందీ, ఇంగ్లీషుకున్న వాల్యూ ఇంకాఅప్పటికి తెల్సిరాలేదు. నాన్న కూడా వాటిని ఎంకరేజ్ చేయలేదు. తెలుగు,సంస్కృతం, పురాణాలు. అవధానాలు… అంతవరకే.

ఇంగ్లీషు మాధ్యమంలోకి…

లేపాక్షిలో టెన్త్ అయిపోయాక హిందూపూర్లో ఇంటర్ చదివాను.ఇంటర్లో చేరేటప్పుడు మా బంధువుల మధ్య చర్చ… ఏం చదివితేబావుంటుందీ అని. టెన్త్ ఫస్ట్ క్లాస్. ఇంటర్లో ఏం గ్రూపు తీసుకోవాలి అన్నచర్చ వస్తే… బైపీసీ తీసుకుని మెడిసిన్ చదవాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.ఇంటర్లో ఇంగ్లీషు మీడియం తీసుకున్నాను. అది ఇబ్బంది అవుతుందనేఆలోచన నాకు గానీ, నాన్న గారికి గానీ లేదు. స్నేహితులు ఇంగ్లీషు మీడియంకష్టం అని హెచ్చరించారు కానీ, దాన్ని అంతగా పట్టించుకోలేదు. క్లాసులుప్రారంభమయ్యాక వారం రోజుల్లోనే తెల్సింది. పాఠాలేమీ తలకు ఎక్కడంలేదు.అప్పటిదాకా తెలివైనవాణ్ణి అనిపించుకుని… టాప్ఫైవ్లో ఉంటూ వచ్చిన,నాకు ఆ పరిస్థితి మింగుడు పడలేదు. పాఠాలేవీ అర్థం కావడంలేదు. ఇంగ్లీషుమీడియం అడ్డుపడుతోంది. నెల రోజుల్లో అలవాటవుతుంది అనుకున్నాను. కానీసాధ్యం కాలేదు. అలా ఫస్టియర్ అయిపోయింది. కెమిస్ట్రీ ఫెయిల్. సప్లిమెంటరీపరీక్ష రాశాను. మళ్ళీ ఫెయిల్. నా జీవితంలో మొదటి వైఫల్యం. చదువులోఫెయిలవుతానని నేను కానీ, నా చుట్టూ ఉండేవారు కానీ ఊహించలేదు.

సెకండీయర్లో రెండు పేపర్లు ఫెయిల్. ఫస్టియర్ సబ్జెక్ట్ ఇంకా పూర్తికానేలేదు. ఫస్టియర్లో ఫెయిలైనప్పుడే ఇక చదువుకు దూరం అయ్యానుఅనిపించింది. ఈ చదువు నాది కాదనే భావన కలిగింది. ఇంట్లో కూడా అదేఅభిప్రాయానికి వచ్చారు. ఇంగ్లీషు మీడియంవల్ల సమస్య వచ్చిందని అమ్మానాన్న గమనించలేదు. మీడియం మారాలన్న ఆలోచన నాకు రాలేదు. ఏదైతేనేంచదువుకు దూరం అయ్యాను. అట్లా ఇంగ్లీషు మీడియం నా ఫెయిల్యూర్కుకారణం అయింది. లెక్చరర్ కొడుకు ఫెయిల్ కావడం అందర్నీఆశ్చర్యపరిచింది. నన్ను శూన్యంలోకి నెట్టివేసింది.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.