"

ఇనుమడించిన ఆత్మగౌరవం – నీరజ

ఇనుమడించిన ఆత్మగౌరవం – నీరజ

అనేక ఆర్థిక ఇబ్బందుల మధ్య, అతి కష్టంమీద ఇంటర్ పూర్తి చేసిన పల్లెటూరి అమ్మాయి ఉద్యోగం కోసం బెరుకు బెరుకుగా రాష్ట్ర రాజధానిలో అడుగుపెట్టింది. పై చదువులు చదవలేని పరిస్థితి. ఉద్యోగం చేయడం అనివార్యం. ఏ బస్సు ఎక్కాలో, ఎక్కడ దిగాలో తెలియక అవస్థలు. దానికితోడు చిన్న ప్రపంచంలోంచి అమాయకంగా బయటకి వచ్చిన ఆమె ఒక్కసారి కఠినమైన, విశాలమైన ప్రపంచంలో పడినట్టయింది. అదీ ఒంటరిగా. ఆమె చేయాల్సిన ఉద్యోగం దళితులపై ఆక్రమాలు, అన్యాయాలను గుర్తించి, అవసరమైతే సంఘటనా స్థలానికి వెళ్ళి నివేదికలివ్వడం. దళితుల పౌర, రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంఘిక, మానవ హక్కుల ఉల్లంఘన, వారిపై అణచివేత,  విద్యావకాశాలు గౌరవంగా బతికే హక్కుల నిరాకరణ – ఇవన్నీ స్వయంగా చూసిన ఆమెకు సమాజం అసలు స్వరూపం కనిపించింది. సమాజంలో బతకడం ఎలాగో నేర్పింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్దంతరంగా ఇంటర్లో ఆగిన చదువును అంబేద్కర్ యూనివర్సిటీ సాయంతో కొనసాగించింది. ఉద్యోగం చేస్తూనే బిఏతో పాటు సోషియాలజీలో ఎంఏ చేయగలిగింది. ఇప్పుడు మదురై కామరాజ్ యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తోంది.

Media Attributions

  • neeraja

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.