19 రాజకీయాలు … మంత్రి పదవి
ఆ తరువాత ప్రస్థానం. పాలిటిక్స్ చదువు, క్రమంగా నన్ను రాజకీయాలకు చేర్చింది. ఎమ్మార్పీ ఎస్ ఉద్యమం ప్రారంభమయింది. లెక్చరర్‌గా పనిచేస్తున్న నేను ఆ ఉద్యమంలో పాల్గొని ప్రసంగించేదాన్ని. చిన్నప్పటి నుంచీ నేను డాషింగ్, దానికి చదువు మెరుగుపెట్టింది. నా ప్రసంగాలు, ఉత్సాహం చూసి కృష్ణమాదిగ ఉద్యమంలోకి ఆహ్వానించారు.అదే పొలిటికల్ ఎంట్రన్స్. అప్పటికే నేనొక ఆర్గనైజేషన్ మొదలుపెట్టాను. మహిళా హక్కుల పోరాట సమితి పేరుతోగ్రామీణ మహిళల సమస్యలపై పోరాటం చేశాం. కలెక్టర్ సతీష్ చంద్రను చీఫ్ గెస్థగా పిలిచాము. తర్వాత నేను మినిస్టర్ అయ్యాక మేమిద్దరం ఓ ప్రోగ్రామ్‌లో కలుసుకున్నాం. అప్పుడు ఆయన నా గురించి ఎంత గొప్పగానో చెప్పారు. ఒకగృహిణి, లెక్చరర్‌గా, మినిస్టర్‌గా ఎలా ఎదిగారో చెప్పారాయన.
ఎంపీ చేస్తున్నప్పుడు పాశ్వాన్ పార్టీ ‘రళిత సేన’లో చీఫ్ సెక్రటరీగా చేశాను. పార్టీలో తిరగడం చూసి ఇంటెలిజన్స్ వాలు వచ్చారు. రాజకీయాల్లో ఆసక్తి ఉందా అని అడిగారు. పిల్లలు అప్పటికి చిన్నవాళ్ళు. నాకిప్పుడే అంత ఆసక్తి లేదన్నాను. నేనప్పుడు ఒప్పుకుని ఉంటే నా రాజకీయ జీవితం మరోలా ఉండేది.
ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు,ఇబ్రహీంపట్నం నుంచి టిక్కెట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కొత్త ప్రతిపాదన తెచ్చారు. ప్రతిభ గలవారిని,చదువుకున్న వారిని ఎంకరేజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మొదట కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది.వెంకటయ్య లాంటి వారు ప్రోత్సహించారు. మా ఆయన నా బయోడేటా చంద్రబాబుకు ఇచ్చారు.మొదట పురుషులకు టిక్కెట్ ఇవ్వాలనుకున్నారు. దానితో మా ఆయన పేరు ముందుకు వచ్చింది. అప్పటికే నేను ఎమ్మార్పీయస్ ఉద్యమంలో బాగా తిరగడం వల్ల ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో నా పేరు చంద్రబాబు దగ్గరికెళ్ళింది. అలా నాపేరు ఖాయమైంది. మా కమ్యూనిటీలో నా క్వాలిఫికేషన్ అనుకూలమైంది. బాగా చదువుకోవడం కలిసి వచ్చింది. మా ఆయనతో కలిసి స్కూటర్ర పైవెళ్ళి ‘బి-ఫారం’ తెచ్చుకున్నాం. అసూహ్యంగా గెలిచాను. ధైర్యం, పట్టుదలతో పాటుచదువు నాకు దేవుడిచ్చిన వరం.
ఆ తర్వాత వివిధ సమీకరణాల మధ్య నేను సాంఘిక సంక్షేమ మంత్రిసయ్యాను. చదువుకోవడం, వివిధ ఉద్యోగాలుచేయడం, ఉద్యమాలలో తిరగడం… సహజంగా ఉన్న డాషింగ్ నేచర్ మంత్రి పదవి నిర్వహించడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పుడు గతంలోకి వెళితే ఆనందం, ఆశ్చర్యం అనిపిస్తోంది. చదువుపై ఏమాత్రం అసక్తిలేని నేను ఎలాగో టెన్త్
రాకా రావడం, పిల్లలు, సంసారం మధ్య చదువుకోవడం… అదే చదువు నన్ను ప్రపంచంలోకి తీసుకురాపడంతోపాటు. ఎమ్మెల్యేనీ, మంత్రినీ కూడా చేసింది.
దీనికి అంబేద్కర్ యూనివర్సిటీ నాకు దారి చూపింది అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళకోసమే ఇది వెలిసిందేమో. అందుకే ఇప్పటికీ నేను అందరినీ ఎంకరేజ్ చేస్తాను. ‘వయసు మరిచిపోయిచదువులో చేరందీ’ అని.