30 డిగ్రీలో గోల్డ్ మెడల్…
అంబేడ్కర్ యూనివర్సిటీ మళ్ళీ నన్ను చదువులో పడేసింది. ఏదైనా నాకు మనసా వాచా కర్మడా చేయడం అలవాటు. చదువూ అలాగే. పూర్తి స్థాయిలో కాన్సంట్రేషన్. ఓసారి పేపర్లో ఎవరికో గోల్డ్‌మెడల్ ఇచ్చిన వార్త, ఫోటో చూశాను. నాకు వస్తే అన్న ఊహ, ఆ వెంటనే అంత సీన్ లేదన్న ఆలోచనా వచ్చాయి. డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంఏ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉండగా లెటర్ వచ్చింది. ఇంటికి వచ్చిన ఆ లెటర్ హైదరాబాద్ కు పంపించారు. దాంట్లో డిగ్రీలో స్టేట్ ఫస్ట్, గోల్డమెడల్ వచ్చిందని ఉంది. ఇక ఆ రోజంతా గాలిలోనే. పేపర్ వాళ్ళు… ఇంటర్వ్యూలు, వార్తలు, జీవితం ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించింది. గొప్ప ఫీలింగ్ అది. ఏ పనిచేసినా నన్ను నేను మరిచిపోయి లీనమై చేయడమే ఇలాంటి విజయాలకు కారణమని అనిపిస్తుంది. ఆ తర్వాత ఉద్యోగంలో సక్సెస్ అవడానికి ఇదే పనితీరు ఉపయోగపడింది.
జర్నలిస్టుగా …
అప్పటికే గుజరాత్ సివిల్ వర్క్ లో నాన్న నష్టపోయి ఉన్నారు. ఇక చదవడం కష్టం. జాబ్ చేయడమే మార్గం అనిపించింది. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభలో అప్లయి చేశాను. రెండింటి లోను వచ్చింది. మొదట కొంతకాలం ఆంధ్రజ్యోతిలో చేశాక, ఆంధ్రప్రభలో చేరాను. దాదాపు అరేళ్ళు జర్నలిస్టుగా విభిన్నమైన అనుభవాలు. నేను ఎంచుకున్న జర్నలిస్టు ఉద్యోగం బాగా ఎంజాయ్ చేశాను. చాలా వ్యాసాలు, వార్తలు రాశాను. బాగా పేరొచ్చింది. నిజానికి ఆంధ్రప్రభలో చేరేటప్పుడు ‘నువ్వు చేసింది డిగ్రీ, మాకు పీజీ వాళ్ళు కావాలి, నీ చదువు సరిపోదు’ అన్నారు. కానీ వాళ్ళు పెట్టిన పరీక్షలో పీజీ వాళ్ళ కన్నా నేనే బాగా రాసి ఒప్పించ గలిగాను. ఉద్యోగంలో కుదుట పడ్డాక వెళ్ళయింది. ఆ తర్వాత పాప పుట్టింది.
బీసీజే… గోల్డ్ మెడల్
డిగ్రీతో ఆపితే ఎలా? ఇంకా చదవాలనిపించింది. తెలుగు యూనివర్సిటీ బీసీజే ఎంట్రన్స్ రాశాను. సీటు వచ్చింది.ఆంధ్రప్రభలో ఉద్యోగం, పాపను చూసుకోవడం. బీసీజే డిగ్రీ… వాటి మధ్య ఎంతెరన్స్ కష్టం అయింది. కానీ చేపన్ను కదా… నేనుదేన్నీ అంత తేలిగ్గా వదిలేదాన్ని కానని. బీసీజే విజయవంతంగా పూర్తయ్యింది. అదీ యూనివర్సిటీ ఫస్ట్, యూనివర్సిటీచరిత్రలో మొదటి డిస్టింక్షన్నమరియు గోల్డ్‌మెడల్ వచ్చింది. టెంత్ రెండుసార్లు ఫెయిలైన అమ్మాయి చదువులో రెండో విజయం.
మళ్ళీ అంబేద్కర్ వర్సిటీకి… మరో గోల్డ్ మెడల్
బీసీజే అయిపోయాక అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి బీవీ ఆర్(పబ్లిక్ రిలేషన్స్) కోర్సులో చేరాను. అక్కడ స్టేట్ ఫస్ట్ వచ్చింది. మళ్ళీ గోల్డ్మెడ. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే రెగ్యులర్ గా చేశాను. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకొక గోల్డె. అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీలో పడిన పునాది పైచదువుల్లో బాగా పనిచేసింది. డిగ్రీలో నేను పడిన కష్టం, చేసిన శ్రమ నన్ను బాగా సంతోష పెట్టింది. కరెంట్ పోతే దీపం వెలుతురులో కూడా చదివే దాన్ని అంత ఇంట్రెస్ట్ వచ్చిందప్పుడు. అదే తర్వాత ఉపయోగపడింది.
ఉద్యోగ జీవితం
ఏపీపీఎస్సీ నుంచి డీపీ ఆర్వో ఉద్యోగం వచ్చింది. చాలా కాంపిటీషన్ ఎదుర్కొని సాధించా. నాన్న ప్రభావం, నాకు స్వతహాగా ఉండే పట్టుదల, ఉద్యోగంలో రాణించడానికి బాగా ఉపయోగపడ్డాయి. దాదాపు పన్నెండేళ్ళ నుంచి గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్నాను. కృష్ణా జిల్లాలో మొదటి పోస్టింగ్. నా జర్నలిస్ట్ అనుభవంలో ‘ఆంధ్రప్రదేశ్’ మగజిన ని బాగా తీర్చిదిద్దాను. సర్క్యులేషన్ అనూహ్యంగా పెరిగింది. ‘ఈ-సేవా’ పేరును సూచించింది నేనే. స్వతంత్ర దినోత్సవం,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రులకు ఉపన్యాసాలు ఎన్నోసార్లు నేనే రాసిచ్చాను. ప్రాథమికవిద్యలో తప్పటడుగులు పడిన నేను ‘విద్యారత్న’ అవార్డు రాకా ఎదగడానికి అంబేద్కర్ యూనివర్సిటీలో పడిన అక్షర బీజమే కారణం. ఎన్నో విదేశాలు తిరిగాను. అక్కడ ఆర్థిక, సామాజిక స్థితిగతులు, రోడ్లు, అక్కడి జీవన విధానం గమనించాను. మనం అలా ఎందుకు ఎదగలేం అనిపిస్తుంది. మన దేశం ముందుకు పోవడానికి ఎంతో చేయొచ్చు అనిపిస్తుంది. నేనైతే ఆయా విభాగాల్లో ఇంకా బాగా పనిచేసేదాన్ని అనిపిస్తుంది. ఎందుకు చెబుతున్నానంటే చదువు నాకు ఇచ్చిన ఆలోచనే ఇదంతా, చదువు వల్ల మనిషిగా ప్రవర్తన, నలుగురిలో ఉండే తీరు మారింది ‘క్వాలిటీ ని పెంచింది. సమాజం గురించి ఆలోచించేలా చేసింది. దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగలమన్న ఆత్మవిశ్వాసాని ఇచ్చింది.