"

35 దర్జీ కుటుంబంలో చదువుల దర్జా- ఈశ్వర్

‘చిప్పలోన బడ్డ చినుకు ముత్యంబయ్యె’… అన్నట్టు గా అంబేద్కర్ యూనిపర్పిటీని ఆలంబనగా చేసుకుని జీవితాన్ని మార్చుకున్న ‘ఈశ్వర్’ కథ ఇది.గ్రామీణ భారతంలోని అన్ని పర్వాలు పేదరికంతో రాసుకున్నవే. అలాంటి పేదరికంలోనే చెరుకుపల్లె గ్రామంలో ఈశ్వర్ జన్మించాడు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో ఓ పల్లె అది. తండ్రి దర్జీ, నలుగురు సంతానంలో చివరివాడు ఈశ్వర్. దుస్తులు కుట్టి తండ్రి సంపాదించే డబ్బు పైనే కుటుంబం ఆధారపడాలి. అందుకే జీవితం ఎప్పుడూ చిరిగిన చొక్కాలాగే ఉండేది. బేరం ఉన్ననాడు తిండి, లేనినాడు లేదు.

పిల్లలకు తనలాంటి ఇబ్బంది రాకూడదనుకున్నాడు తండ్రి. అందుకేనలుగురు పిల్లలను స్కూల్లో చేర్పించాడు. చదువు, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని కలలు కన్నాడు. కానీ పేదరికానికి చదువుకు చాలా దూరం.సరస్వతీ కటాక్షానికి ఈశ్వర్ చాలా కష్టపడ్డాడు.

అసలే పుస్తకాల కొరత, నోట్బుక్స్ కానుక్కోవడానికి చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఆపై రోజూ స్కూలుకు ఐదు కిలోమీటర్ల నడక. రోజూ నడచి వెళ్ళి రావల్సిందే.మరో దారిలేదు. కానీ, చదువుపై ఉన్న అమితాసక్తి ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా చేసింది. అతని మనసులో ఒక్కటే దేయం. బాగా చదివి,మంచి ఉద్యోగం సంపాదించాలి. తండ్రికి సాయపడాలి మరియు తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తొలగించాలి. ఇదే అతన్ని చదువుకు మరింత దగ్గర చేసింది.టెన్త్దాకా చదువు బాగానే సాగింది. టెన్త్ పాసై ఇంటర్లో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో చదువు సరిగ్గా సాగలేదు. రాంతో ఇంటర్ ఫెయిలయ్యాడు. చదువు అర్థంత రంగా ఆగిపోయింది. ఇంట్లో చూస్తే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. ఇక తాను తండ్రికి భారం కాకూడదనుకున్నాడు. చదివిన కాడికి సార్ధకత ఉండాలనుకుని… వెంటనే ఎంకేఆర్ డిగ్రీ కాలేజీలో లాబ్ అసిస్టెంట్గా చేరాడు.

చిన్న ఉద్యోగం. తక్కువ జీతం రోజులెలాగో గడుస్తున్నాయి కానీ, తను అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయానే అని మనసులో దిగులు ఉండేది. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలనే తపన అలాగే ఉండిపోయింది. కానీ,ఉద్యోగం చేయక తప్పనిసరి పరిస్థితి.

ఇక్కడే అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఈశ్వర్కు దారిచూపింది. ఉద్యోగం చేస్తూనే చదువుకునే అవకాశం కల్పించింది. అంబేద్కర్ యూనివర్సిటీ గురించి స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఈశ్వర్ డిగ్రీలో చేరాడు. ఇప్పుడాయన అత్యంత ప్రతిష్టాత్మకమైన పరిశోధనా సంస్థ డీఆర్డీఎల్(హైదరాబాద్)లో కంప్యూటర రీసెర్చ్ ఎనలిస్ట్గా పనిచేస్తున్నారు. ఈశ్వర్ పట్టుదలతో పాటు అంబేద్కర్ ఓపెన్వర్సిటీ సహకారం రాసిన విజయ గాథ ఇది.

టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసైన ఈశ్వర్ ఇంటర్లో బీవీసి గ్రూపు తీసుకున్నాడు. ఇంటర్ చదువుతున్నప్పుడే కంప్యూటర్స్ నేర్చుకోవడం బతుకు తెరువుకు దారి చూపింది. అతని కుటుంబానికి చేదోడు వారోడుగా నిలిచాడు. అతను పని చేస్తున్న ఎంకేఆర్ డిగ్రీ కళాశాలలోనే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ రావడం ఈశ్వర్ జీవితంలో పెద్ద మలుపు. చాలామంది ఉద్యోగ బాధ్యతలకు ఇబ్బంది లేకుండా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ క్లాసులకు అటెండ్ కావడం అక్కడ ఈశ్వర్ గమనించాడు. ఆ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులు, అందులో వెసులు బాటు అర్థం చేసుకున్నాడు. ఆ సంస్థ విద్యార్థులను కలుసుకుని మాట్లాడారు. తనకు నేర్చుకోవడానికి అంబేద్కర్ యూనివర్సిటీనే సరైన మార్గం అని నిర్ణయించుకున్నాడు. ఇంటర్లో ఫెయిలై ఇక ఇంతే అన్న నిస్పృహలో ఉన్న తనకు అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ కొండంత బలాన్ని ఇచ్చాయంటా రాయన. దానికి తోడు ఎంకేఆర్ కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు బాగా ఎంకరేజ్ చేశారు. దానితో అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. ఉత్తీర్ణుడై బీఎస్సీలో అడ్మిషన్ తీసుకున్నారు.

కాలేజీలో పని అయిపోయాక సాయంత్రం ఇంటికి వచ్చి చదవడం.మామూలు డిగ్రీ కన్నా బీఎస్సీ ప్రిపేర్ కావడం – అలా బాటనీ, జూలోగి, కెమిస్ట్రీ కష్టమేనని గ్రహించి ఇంకా శ్రమించారు. ట్యూషన్కు వెళ్ళే తాహత లేదు. టెస్ట్ పేపర్లు కానే స్థోమత లేదు. పూర్తిగా అంబేద్కర్ యూనివర్సిటీ మెటీరియల్ పైనే ఆధారపడ్డాడు. నిజానికి ఈ సిలబస్ ఎంతటి కాంపిటీటి పరిక్షలు నైనా నిగ్గు తేలడానికి సరిపోతుందంటారాయన. అర్థం కాని విషయాలు యూనివర్సిటీ లెక్చరర్లు విడమర్చి, సులభంగా చెప్పేవారని, తాను తేలిగ్గా డిగ్రీపూర్తి చేయడానికి అదే ముఖ్య కారణమని ఈశ్వర్ కృతజ్ఞతలు చెబుతారు.ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే ఈశ్వర్ బీఎస్సీ సెకండ్ క్లాసులో పాసయ్యారు. దూరమయిందన్న చదువు దగ్గర కావడం, డిగ్రీ కూడా పూర్తిచేయడతో ఈశ్వర్లో విశ్వాసం పెరిగింది. రెగ్యులర్ డిగ్రీలాగే ఈ డిగ్రీతో కూడా ఉపయోగాలున్నాయని గమనించాడు.

మంచి ఉద్యోగం సంపాదించగలనన్న నమ్మకం ఏర్పడింది. అయితే ఇంకా చదవాలన్న ఆసక్తి, అంబేద్కర్ యూనివర్సిటీ ఇచ్చిన ఉత్సాహం అయన్ను పీజీ చేయడానికి పురికొల్పింది. అప్పటికే ఐటీ బూమ్ నడుస్తోంది. తానూ అదే దారిలో నడవాలనుకొన్నాడు. నాగార్జున యూనివర్సిటీ ఆఫర్ చేస్తోన్న ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేరాడు.

ఎంఎస్సీ చేస్తుండగానే, డీఆర్డీఎల్‌లో రీసెర్చ్ ఎనలిస్ట్ కావాలంటూ వచ్చిన ప్రకటన చూశారు. అతని సహోద్యోగులు అప్లై చేయాలంటూ ప్రోత్సహించడంతో ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. దానికి కావలసిన అర్హతలు డిగ్రీ, కంప్యూటర్ స్కిల్స్.. రెండూ ఈశ్వర్కు ఉన్నాయి. దానితో పాటు, కంప్యూటర్ రంగంలో మూడేళ్ళ అనుభవం ఉంది. ఇంకేం… ప్రతిష్టాత్మకమైన సంస్థలో జూనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్గా ఉద్యోగం సంపాదించాడు.

“అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు ఇచ్చి తమ జీవితాలను ఆర్ధికంగా స్థిరపడేలా చేశాయని అన్నదమ్ములందరూ ఆనందం, కృతఙ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.”

 

అన్నదమ్ములంతా అదే దారి…

ఇంత మంది ఉద్యోగం… అంబేద్కర్ యూనివర్సిటీడిగ్రీ భిక్షే నంటాదాయన. రెగ్యులర్ డిగ్రీలాగే దానికి విలువ ఉందన్న విషయాన్ని తన ఉద్యోగం నిరూపిస్తుందంటున్నారు. ఇదే విషయాన్నిస్నేహితులకు, సహోద్యోగులకు చెబుతుంటారు. అంబేద్కర్ యూనివర్సిటీలో చేరాలని ప్రోత్సహిస్తుంటారు. ఈయన సూచనతోనే అతని సోదరుడు లోకేశ్ అంజీద్కర్ యూనివర్సిటీలో చేరి బీఏ పూర్తి చేశాడు. ఇప్పుడు లోకేశ్ కూడా హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కాలేజీలో ఆఫీస్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తన్నారు. అలాగే ఈశ్వర్ అన్నయ్య వెంకటేశ్వర్లు కూడా అంబేద్కర్ యూనివర్సిటీనుంచి డిగ్రీ పూర్తి చేయడమే కాదు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ కూడా చేశారు. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీలు ఇచ్చి తమ జీవితాలను ఆర్థికంగా స్త్రిరపదెల చేశాయని అన్నదమ్ములందరూ ఆనందం, కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.

రణతంత్రాల మధ్య… 

కటిన సైనిక శిక్షణ మధ్య చదువు విస్మరించని వెంకటేశ్వర్లు కథ ఇది.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.