18 ఉస్మానియాయా యూనివర్సిటీకి…
ఓసారి ఉస్మానియా యూనివర్సిటీ చూస్తే ఆ వాతావరణం… గొప్పగా అనిపించింది. ఇక్కడ చదువుకోవాలనుంది అని చెప్పాను, మా ఆయన సీరియస్ గా తీసుకోలేదు. రెగ్యులర్ స్టూడెంట్స్కే కష్టం. నీకెలా సాధ్యం అన్నారు. నేను ఇందులో చదువుకుని చూపిస్తానన్నాను. నేనొక ఒకదాన్నే బస్సులో కోరి వెళ్ళి పుస్తకాలు వెతుక్కుని, వీజీ ఎంట్రన్స్కు ప్రిపేర్ అయ్యాను. పరీక్షా రాయడం కూడా గమ్మత్తుగా జరిగింది. పెళ్ళికి వెళ్ళి అలాగే పట్టుచీరెతో పరీక్ష హాలుకు వెళ్ళి ఎంట్రన్స్ రాశాను. అందరు వింతగా చూశారు. నాకు ఎరనా మిక్స్, పొలిటికల్ సైన్స్ ఇంట్రస్ట్, కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో సీటు వచ్చింది. ఆ రోజు రిజర్వ లో నా నంబర్ చూస్తే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం కలిగింది. అడ్మిషన్ సమయంలో ఉస్మానియా ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. ‘ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉస్మానియాలో రెగ్యులర్ సీటు సాధించావా…’
అని అక్కడ స్టాఫ్ అందరికీ ఈ విషయం చెప్పారు కూడా, అందరూ నన్ను అభినందించారు. ఉస్మానియాలో కాలు పెట్టగానే ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. పుష్పలీల బీఏ అని అనుకోవ దానికే ఆశ్చర్యం అనిపించేది. అలాంటిది పీజీ చేస్తున్నానంటే… అసలు చదువుకు, నాకు అమడదూరం. అలాంటిది యూనివర్సిటీ దాకా వచ్చానన్న ఆనందం, గర్వం. ఆనంద్ థియేటర్ దగ్గర అఫిలియేటెడ్ కాలేజీలో చేరాను. ఇంటికి దగరగా ఉంటుందని, చిన్నప్పుడు ఎంజాయ్ చేయాల్సిన కాలేజీ లైఫ్ పెళ్ళయి, పిల్లలు పుట్టాక అమ్మాయిలు… అయినా వారితో పోటీపడేదాన్ని వాళ్ళే ఆశ్చర్యపోయారు. ‘అక్కా! మమ్మల్నే బీట్ చేస్తున్నావ్’ అనేవారు. అసలు బయట ప్రపంచం ఏమిటో నాకు అప్పుడు తెలిసింది. సెకండ్ క్లాస్లో పీజీ పాసయ్యాను.
లెక్చరర్ గా….
చదువుకున్న దాన్ని ఉపయోగించుకోకపోతే వృధా అనుకునేదాన్ని. అందుకే రిజల్ట్ రాగానే ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా చేరాను. ఇంటర్ , డిగ్రీలకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు పాఠాలు చెప్పేముందు నేనే పుస్తకాలూ ముందేసుకుని అధ్యయనం చేసి ఆ తర్వాత వారికీ చెప్పేదాన్ని. చదువుకున్నది తెలుగులో ఇంగ్లీష్ మీడియం వాళ్లకు లేషన్స్ చెప్పాలి బాగా హోంవర్క్ చేసాము మొత్తానికి వారిని కన్విన్స్ చేయగలిగాను. సివిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేదాన్ని. ఇవి నాకు ఇంకా బాగా అర్థమయ్యాయి. ఎక్కడ నుంచి ఐతే నేను చదువులోకి మళ్లి అడుగు పెట్టానో అక్కడే ఉద్యగం చేయాలనుకున్నాను.ఓపెన్ యూనివర్సిటీ లో ఏ సెంటర్ లో నేను విద్యార్థిగా చేరానో అక్కడే ‘కౌన్సెలర్ ‘ గా జాయిన్ అయ్యాను. ఆరు సంవత్సరాల పాటు పాఠాలు చెప్పాను. పెళ్లి, వయసు ఏమి చదువుకు అడ్డం రావని వారికీ నన్ను ఉదాహరణగా చూపి మోటివేట్ చేసేదాన్ని. నిజానికి క్లాసులకు వచ్చేవారు నా కన్నా పెద్దవాళ్ళే ఉండేవారు. ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడు న కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చానూ అని. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీకి వేల్యూ లేదని అభిప్రాయం ఉండేది ఆ కాలంలో. అది చాలా రాంగ్ అని చెప్పేదాన్ని. నేనెలా ఉస్మానియాలో సీట్ సంపాదించాను చెప్పేదాన్ని. స్టూడేంట్స్కు న పాఠాలు బాగా నచ్చేవి జీవితంలో అదొక మైలు రాయి.
భిన్నమైన బాహ్యప్రపంచంలోకి …
వాల్యుయేషన్కు, స్వాతగా, స్కూరటినైజర్ గా కూడా వెళ్ళాను. వాల్యుయేషన్ బాగా ఉపయోగపడింది. చాలా మంచి టీచర్లు, లెక్చరర్లు పరిచయం అయ్యారు. అనేక సూచనలు ఇచ్చేవారు. అభిప్రాయాలు పంచుకునే వాళ్ళం. చదువు వల్లే నేనింత ప్రపంచాన్ని చూడగలిగాను, భిన్నమైన వ్యక్తులను, వ్యక్తిత్వాలను గమనించగలిగాను. నాలుగు గోడల మధ్య నుంచి విశాల ప్రపంచంలోకి రాగలిగాను. పైగా నేను ఫ్రెండ్లీగా ఉండడం, గలగలా మాట్లాడగలగడం నాకు పరిచయాలు పెరిగాయి. నాకు జెండర్ డిఫరెన్స్ లేదు. ఇంట్లో సమస్యలున్నా బయటికి వెళ్తే మరచిపోయి ఉల్లాసంగా ఉండేదాన్ని అది అందరికీ దగ్గర చేసింది. నాకు సమస్య, టెన్షన్ ఉంటేనే హుషారు. లేకుంటే విషాదమే. ఏదో కోల్పోయినట్టే. అందరికీ భిన్నంగా చేయాలనే ఉత్సాహం నన్నిక్కడి దాకా తీసుకు వచ్చింది. ఆడవాళ్ళ పని, మగవాళ్ళ పని విడిగా ఉంటాయంటే నేనొప్పుకోను. రేడియోలో ప్రోగ్రామ్స్ నిర్వహించాను, చర్చల్లో పాల్గొన్నాను. సినిమాల్లో నటించాను. ఇలా విభిన్నమైన రంగాల్లోకి వెళ్ళాను. దానికి కారణం నా చదువే అనిపిస్తుంది. ఎంఫిల్ సీటు వచ్చింది. రూరల్ బ్యాంకింగ్ సబ్జెక్ట్ తీసుకున్నాను. మా ఆయన అదే ఫీల్డ్ కనుక ఈజీగా ఉంటుందని పార్ట్ వన్ కూడా పాసయ్యాను. తర్వాత వేరు వేరు పనుల వల్ల మిగతాది ఆగిపోయింది. ఎంఫిల్ పూర్తి చెయ్యాలనుంది. అది అయిపోయాక పీహెచ్డీ కూడా చేస్తాను, డాక్టర్ పుష్పలీల అని రాసుకోవాలనుంది.