41 ఆర్ధిక పరిస్థితి…
అమ్మ ఎస్ఎస్ఎలసీ దాకా చదువుకుంది. నాన్న ఆర్ఎంపీ ప్రాక్టీచేస్తారు. హాస్పిటల్లో నాన్నకు అమ్మ సాయంగా ఉండేది. మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా పుల్లేటికుర్రులో ప్రాక్టీసు నడిచేది. ఆ తర్వాత ప్రక్కనున్నరామచంద్రపురంలో కొంతకాలం ప్రాక్టీసు చేశారు. హాస్పిటల్ బాగా నడిచేది కానీ, నాన్న బాధ్యతగా ఉండేవారు కాదు. వృత్తిలోనే కాదు.. మా పట్ల కూడా బాధ్యత తక్కువే. నాన్న చాలా దుబారా, విచల విడిగా ఖర్చులు, దానికి తోడు అప్పులు. ఉన్న పొలం కాస్త ఆరిపోయింది. ఇల్లు గడవడమే కష్టమైపోయింది. మేము ముగ్గురం… అక్కా, నేను తమ్ముడు. నాన్న ప్రవర్తనతో మా చదువులు ప్రశ్నార్థకమయ్యాయి.
అమ్మ చొరవతో…
మా చదువులు కుంటు పదయాని గ్రహించిన అమ్మ నన్ను, అక్కను ఎప్పీ హాస్టల్లో చేర్పించింది. నేను తొమ్మిదవ తరగతి వరకు హాస్టల్లో ఉన్నాను.ప్రక్కనే ఉన్న కొత్తపేట గర్ల్స్ హైస్కూల్లో చదువు. ప్రాథమిక విద్య గట్టెక్కగలి గామంటే అది హాస్టల్ పుణ్యమే. అక్క డిగ్రీకి వచ్చాక పెళ్ళిచేశారు. అక్క చదువుకుందని కాళీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నారు. అక్క పెళ్ళి అలా ఖర్చులేకుండా అయిపోయింది. లేకుంటే అమ్మకు అది పెను భారయ్యేది. అక్కు పెళ్ళిచేసుకుని వెళ్ళిపోగానే నేను హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాను. అప్పుడు టెంత్ క్లాస్స్లోఉన్నాను. అప్పటికే నాన్న పట్టించుకోకపోవడం వల్ల హాస్పిటల్ మూతపడింది. అప్పుడే ఊర్లోకి ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చారు. అమ్మ ఆయన హాస్పిటల్లో నర్సుగా చేరింది. దానితో ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటవడింది.నేను టెంత్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యాను. ఇంటర్ ఎంపీసీలో జాయిన్ అయ్యాను.సెకండియర్లో ఉండగా అక్క డెలివరీకి ఇంటికి వచ్చింది. అమ్మ ఉద్యోగంలో ఉండడంలో అక్కను చూసే బాధ్యత నాపై పడింది. దానితో ఇంటర్లో మార్క్స పోయింది. కానీ ఎలాగో గట్టిక్కాను.
రాజధానిలో ఉద్యోగం
ఇంటర్ పూర్తయ్యింది. నాకు ఇంకా చదవాలనుంది కానీ ఇంటి పరిస్థితి సహకరించేలా లేదు. టెంత్ అయిపోయాక, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశా, సీటు వచ్చింది. అమ్మను అడిగా జాయిన్ అవుతానని. అమ్మ ఏం చేయలేకపోయింది ఏడవడం తప్ప. అదీ మా కుటుంబ పరిస్థితి. ఆ సంఘటన జ్ఞాపకం వచ్చి డిగ్రీలో చేరతానని అమ్మను అడగలేకపోయా. ఇంతలో హైదరాబాద్ లో సెటిలైన మా మేనమామ ఇక్కడ ఉద్యోగం ఉంది, చేయమని సలహా ఇచ్చారు. డిగ్రీ కరెస్పాండెన్స్ కోర్సయినా చేయవచ్చు. ‘అమ్మకు అసరా ఉంటుందని హైదరాబాద్ వచ్చి ఎన్జీవో సంస్థ ‘సాక్షి’లో చేరాను. డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ ఉద్యోగం.
విస్తృత సమాజంలోకి …
విమెన్స్ హాస్టల్లో ఉండి ఆఫీసుకు వెళ్ళేదాన్ని, ఊర్లోంచి వచ్చి నగరంలో వాలేసరికి కొన్ని రోజులు అంతా గందరగోళం. బస్సు లో వస్తే ఒక్కోసారి ఆఫీసు కూడా గుర్తు పట్టగలిగేదాన్ని కాదు. డబ్బులు పోతే పోయాయని ఆటోలో ఆఫీసుకు వెళ్ళేదాన్ని. రెండు, మూడు నెలలకు అలవాటైపోయింది. రోజూ ఇంగ్లీషు, తెలుగు దినపత్రికలు అన్నీ చదవడం… 23 జిల్లా ఎడిషన్లు ముందేసుకుని ఎస్సీ, ఎస్టీలు ముఖ్యంగా దళిత మహిళలపై జరిగే అక్రమాలను, అత్యాచారాలను, నేరాల గురించి వార్తలు, వ్యాసాలు గుర్తించి ఫైల్ చేయడం. నోట్లు, రిపోర్ట్స్ తయారుచేయడం. అవసరమైతే అత్యాచారాలు, హత్యలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళడం, బాధితులను, గ్రామస్తులను, సంబంధిత అధికారులను, పోలీసు అధికారులను సంప్రదించడం… సంఘటనపై నివేదిక తయారుచేయడం… ఇదీ నా పని. ఒక్కసారిగా విశాల ప్రపంచంలో పడ్డట్టు అనిపించింది. దళిత మహిళల సమస్యలు చూస్తోంటే నా సమస్యలు చాలా చిన్నవిగా కనిపించేవి. ఒక్కోసారి ఆ సంఘటనలు మనసును కలచివేసేవి,
అప్పటిదాకా నేనున్నది చిన్న ప్రపంచం. పైగా నేను సెన్సిటివ్. సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడే ఏడ్చేసేదాన్ని. చాలామంది పోలీసు అధికారులు ‘ఇంకా చిన్న పిల్లవు… ఈ హ్యూమన్ రైట్స్ గొడవలు నీకెందుకు… హాయిగా చదువుకోవచు గదా’ అనేవారు. హాయిగా చదువుకునే అవకాశం ఉంటే ఉద్యోగాలు చేయడం ఎందుకు? ‘సాక్షి’లో ఏడేళ్ళ పాటు ఉద్యోగం చేశాను. అక్కడ నేను చూసిన అనేక సమస్యలు సమాజం అసలు స్వరూపమేమిటో తెలిసేలా చేశాయి. ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు, ఎంతో అజ్ఞానం… లేకుంటే కూతురుకు బాణమతి చేశారని మనుషులు తోటి వారిని చంపుతారా? ఇంకా విజ్ఞానం చేరని ప్రదేశాలు మరియు మనుషులు . ప్రతిచోటా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది.