40 సివిల్స్, గ్రూప్-I …
డిగ్రీ రాస్తూనే ఐఏఎస్ అధికారి వెంకటేశం సలహాలు తీసుకుంటూ సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. 2004 సంవత్సరంలో మొదటిసారి రాశాను. క్వాలిఫై కాలేదు. నిరుత్సాహపడలేదు. చాలెంజ్గా తీసుకుని మళ్ళీ రాశాను.ఈసారి మెయిన్స్ కూడా పాసయ్యాను కానీ ఇంటర్వ్యూలో పోయింది. 2006 సంవత్సరంలో గ్రూప్-1 పరీక్ష రాశాను.ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా పాసై ఇంటర్వ్యూకు కూడా వెళ్ళాను. బీసీ-డి క్యాండిడేట్ల ఎంపిక కోర్టు పరిధిలో ఉండడంతో సెలక్షన్ పెండింగ్లో పడింది. పాజిటివ్ రెసుల్త్ కొసం ఎదురు చూస్తున్నాను. నెగ్గుతానో లేదో అన్న విషయం పక్కనపెడితే గ్రూప్-I, సివిల్స్ లాంటి కొండలను ఢీకొట్టే శక్తి సామర్థ్యాలను అంబేద్కర్ యూనివర్సిటీ ప్రసాదించింది.విశ్వాసాన్ని, విజ్ఞానాన్ని ఇచ్చింది. నా ప్రయత్నం నేను చేశాను. అంతే చాలు.
డిగ్రీ అయిపోయాక నాగార్జున యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పిహెచ్ డి పొందాను. ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను.
అలాగే ఇగ్నో నుండి బీఈడీ కూడా కంప్లీట్ చేశాను.
ఇది నాన్న మాట…
“దిగ్రీ పూర్తయ్యాక వాడి జీవితంలో చాలా మార్పు వచ్చింది. కొత్త విశ్వాసం చూశాను. చాలా పేద కుటుంబం మాది. వాడికి కోచింగ్ ఇప్పించలేం, డొనేషన్లు కట్టలేం. అందుకే బిఈడీ చేయమని ఎంకరేజ్ చేశాను. ఏదో ఉద్యోగం దొరుకుతుంది కదా అని. కానీ వాడి లక్ష్యం మారిపోయింది. నేను ‘డాక్టర్’ లక్ష్యం నుంచి వాణ్ణి తప్పిస్తే వారు ‘ఐఏఎస్’లక్ష్యంగా పెట్టుకుని కష్టపడ్డాడు. నాకు వారి కల నిజం కావాలని ఉంది. వాడికి అంబేద్కర్ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడింది” అంటున్నారు, మా నాన్న.
అదనంగా సంపాదన…
గ్రూప్-1 మెయిన్స్ అయిపోయాక టీచర్ ఉద్యోగంతో పాటు ఆర్కే ఇనిస్టిట్యూట్లో పనిచేయడం మొదలుపెట్టాను.ఆంత్రోపాలజీ, జూలోగి చెబుతున్నాను. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేయడం నా పని. ఇది అంబేద్కర్ యూనివర్సిటీఇ చ్చిన విశ్వాసమే కదా. దానివల్ల అదనంగా కొంత ఆదాయం, కొంత ఉత్సాహం వస్తోంది. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు క్షుణ్ణంగా అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు చదివితే చాలు, బాగా స్కోర్ చేయవచ్చు. ప్రస్తుతానికినా కరదీపికలు అవే.