39 సడలని దీక్ష…
మొదటిసారి ఎంబీబీఎస్ సీటు రాలేదు నిరాశగా అనిపించింది. పట్టుదల మాత్రం తగ్గలేదు. మెడిసిన్ తప్ప మరొకది చేయకూడదనుకున్నాను. ఆ సంవత్సరం కూడా ఎంసెట్కే ప్రిపేర్ అయ్యాను. ఇంట్లోనే ప్రాక్టీస్, కోచింగ్ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. దాంతో పాటు ఆరోగ్యం సహకరించలేదు. లక్ష్యంలో మళ్ళీ ఫెయిల్.నాన్న బిఈడీ చేసి టీచర్ అవమన్నారు. ఆ ఉద్యోగం అయితే నా ఆరోగ్య పరిస్థితికి సహకరిస్తుందని ఆయన సలహా. వారి సూచన ప్రకారం బిఈడీ ఎంట్రన్స్ రాశా, మంచి ర్యాంకు వచ్చింది. కానీ జాయిన్ అవలేదు. నా లక్ష్యం డాక్టర్… అంతే. అమ్మా నాన్న మండిపడ్డారు… ర్యాంకు వచ్చినా చేరనందుకు.నేను అతి కష్టంమీద వారిని ఒప్పించాను. ఇదే చివరి ప్రయత్నం. ఈ ఒక్క సంవత్సరం కష్టపడి ఎంసెట్ రాస్తానన్నాను. ఆ తర్వాత వారిష్ట మన్నాను. కానీ,మళ్ళీ అదే పరిస్థితి. మందులు, అనారోగ్యం. మెడిసిన్ సాధించలేకపోయాను. డాక్టర్ అవుదామన్న నా కల కరిగిపోయింది. పేదలకు సేవ చేయాలన్న లక్ష్యం నీరు కారిపోయింది.
డీఈడీ, డీఎస్సీ …
అమ్మా నాన్నకు ఇచ్చిన హామీ ప్రకారం బిఈడీ మళ్ళీ రాశాను, సీటు వచ్చింది. వరంగల్ ఐటీ కాలేజీలో చేరాను. డాక్టర్ కల చెదిరిపోయింది. ఇక టీచర్ కావాలి. ఈ ఆలోచనల్లో ఉండగా మా కాలేజీ యాన్యువలిడే ఫంక్షన్నువరంగల్ మునిసిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి వెంకటేశం చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. ఉన్నత వర్గమైనా, వెనుకబడిన వర్గమైనా, ఏ తరగతికి చెందిన వారమైనా నిరుత్సాహపడొద్దు. మన లక్ష్యం నెరవేరేదాకా పట్టుదల వదలొద్దు. కల నెరవేరాలంటే ఎన్ని అవరోధాలైనా అధిగమించాలని ఉద్బోధించారు. అది నాపై బాగా ప్రభావం చూపింది.పర్సనల్గా వెంకటేశం గారిని కలిశాను. ఐఏఎస్ ఆఫీసరైతే పేద ప్రజలకుబాగా సేవ చేయవచ్చని ఆయన సూచించారు. పేదరికం మరియు, నిరుద్యోగాన్నితొలగించే ప్రయత్నం చేయవచ్చన్నారు. ఆ మాటలు నాపై బాగా పని చేశాయి.సివిల్స్ రాయాలనుకున్నాను. ఆయన సూచన మేరకే బిఈడీ పూర్తిచేసి ఆర్థికంగా స్థిరపడి అమ్మా నాన్నలకు బరువు తగ్గించాలనుకున్నా డీఎస్సీకి ప్రిపేర్ అయి 2000 సంవత్సరంలో టిచర్ ఉద్యోగం సంపాదించగలిగాను. ఐఏస అవడానికి అవసరమైన ఆర్థికస్థితి సమకూరింది. దాంతో పాటు టైమ్ కూడా దొరికింది.
అంబేడ్కర్ వర్సిటీ, డిగ్రీ…
ఐఏఎస్ లక్ష్యమైతే ఎంచుకున్నాను గానీ, దానికి కావల్సిన డిగ్రీ అర్హత నాకు లేదు. మొదట డిగ్రీ చేయాలని యూనివర్సిటీ కోసం, అదీ దూర విద్య అందించే యూనివర్సిటీ వెదికాను. సైన్స్ గ్రూపు తీసుకుందామనుకున్నా, దానికి మంచి సదుపాయాలు ఉండాలి. ఫ్రెండ్స్, సీనియర్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ని సూచించారు. దూరవిద్యలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే అంబేద్కర్ యూనివర్సిటీ మంచిదన్నారు. వారి స్టడీ సెంటర్ ఉన్న సీకేఎం కాలేజీలో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. దాంట్లో చేరిపోయా. రెగ్యులర్గా క్లాసులకు అతత్తెండ్ అయ్యేవాణ్ణి. నిజానికి నేను బయాలజీ నుంచి మాథ్స్ కి మారాను, సివిల్స్కు ప్రిపేర్ కావడం ఈజీ అని. తర్వాత భయం వేసింది. ట్యూషన్కు వెళ్ళాల్సి వస్తుందని. కానీ, అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు చూశాక నా అనుమానాలు, భయాలు పటా పంచలయ్యాయి. చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇక క్లాసులలో టీచింగ్ గురించి చెప్పనక్కరలేదు.రెగ్యులర్ వాళ్ళకు ఏమాత్రం తీసిపోకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మమ్మల్ని. ప్రాక్టికల్స్ విషయంలో సీకేఎం కాలేజీ వాళ్ళు చాలా సహకరించారు, అసలు వారి సపోర్ట్ లేకుండా మేమంతా ప్రాక్టికల్స్ పాసయ్యే వాళ్ళమే కాదు. ఎంతో ఓపిగ్గా, సమగ్రంగా ప్రాక్టికల్స్ చేయించారు. ఇలా డిగ్రీ చేస్తున్న వారిలో ప్రైవేటు ,ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులే కాదు, కాంపిటీటివ్ పరీక్షల కోసం డిగ్రీరాస్తున్న వారు కూడా ఉన్నారు. మా అందరికీ సకాలంలో ప్రాక్టికల్స్, పాఠాలు కంప్లీట్ చేసినందుకు సీకేఎం కాలేజ్కి, అంబేద్కర్ యూనివర్సిటీకి అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి.