38 అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా…
అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీతో కదలిన అడుగు… ఇంకా కొనసాగుతోంది. టీచర్గా, కౌన్సెలర్గా, లెక్చరర్గా నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. పెద్దలన పరిచయ భాగ్యం కలిగింది. వారి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ప్రగతి వైపు ప్రస్థానానికి కామాలే కాని, ఫుల్స్టాప్లు ఉండవని తెలుసుకున్నాను. అందుకే చేరిన ప్రతి మజిలీలో మరింత ఉత్సాహం తెచ్చుకోవడమే గాని విశ్రమించడంఎరుగను నేను. ఈ క్రమంలోనే జనవరి, 2007లో తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించాను.మరో ఉన్నత మజిలీ, మరో విజయం.
రచనా వ్యాసాంగం…
చెప్పానుగా, తెలుగు సాహిత్యం అంటే ఎంతో మక్కువ అని. అందుకే రచన ప్రవృత్తిగా చేపట్టాను. కవితలు, వ్యాసాలు రాసేదాన్ని ఎంబీలో నా సిద్ధాంత వ్యాసం, “చిల్లరిగె స్వరాజ్యంక్రి కవిత్వ పరిశీలన.” అలాగే ‘తూనీగలు’ అనేవానీల సంపుటిని ప్రచురించాను. మా పుట్టింటివారు పడుగు, పేకల్లో నలిగిపోయినా సాహిత్యంలో నిగ్గు తేలారు. సాహిత్యం, ఆధ్యాత్మిక తత్వభావం వారిలో అల్లుకుపోయింది. మా పెదనాన్న గారు అచల పరిపూర్ణశ్రీ నిర్మలానంద వంగరివేంకట నారసింహాచార్యులు రచించిన నాలుగు రచనలు – వామన చరిత్రము,మార్కండేయ పురాణం, శ్రీ రామలింగేశ్వర శతకం, భక్తితత్వ సంకీర్తనలను పరిష్కరించి ప్రచురించాను. ఇదేగాక ‘శ్రీ నారసింహాచార్య జీవిత చరిత్ర’ను రచించాను. ఇప్పుడు నా హెచ్‌డీ సిద్ధాంత వ్యాసం “ముదిగంటి సుజాతారెడ్డిర చనలు-సమగ్ర పరిశీలన,’ ‘విపంచిక’ అనే వచన కవితా సంపుటిని ముద్రించే ప్రయత్నంలో ఉన్నాను.
కళలు కనండి …
“కలలు కనండి… వాటిని సాకారం చేసుకోండి” అన్న రాష్ట్రపతి మాటలు చూస్తే నాకు… నా జీవితం, కష్టాలు, చదువులు, ఆశలు, ఆకాంక్షలు,కన్నీళ్ళు, ఆనంద భాష్యాలు, డిగ్రీలు, అవార్డులు, విజయాలు గుర్తుకు వస్తాయి.కూలీగా పనిచేసిన నేను కన్నకలలు, అంబేద్కర్ యూనివర్సిటీ సహకారంతో అవి సాకారం చేసుకున్న తీరు గుర్తుకు వస్తాయి. సమాజంలో నాలాంటి మహాళలు ఎంతో మంది ఉన్నత చదువులు చదవాలన్న ఆశతో ఉండవచ్చు. వారిని నేను కోరేదొక్కటే. ఆశలకు సంకెళ్ళు వేయకండి. వివాహం, వయసు, ఉద్యోగం,ఆర్థిక పరిస్థితి… ఏవీ మన ఆశయాలకు అడ్డం రావు. చెమతోడ్చి జీవితాన్నినెగ్గడమే మనం చేయాల్సింది. ఇప్పుడు నా పిల్లలకు అదే చెబుతున్నాను.