"

మగ్గం పేదరికంలో నిగ్గు తేలిన అక్షరం – త్రివేణి నర్సింహ

 

భావాలకు

ఈ స్కూలే –
సంకెళ్ళు వేయకండి – * * *
శిల్పం మళ్ళీ శిలగా వసంతమొక
మారవచ్చు – మెరుపు మొక్క
* * * దాని అంచున
ఈ దార్లో వస్తుంటే గ్రీష్మం కాపు కాస్తుంది…
మనసు గాల్లో తేలుతోంది. (త్రివేణి నర్సింహ ‘తూనీగలు’ నుంచి)
నా బాల్యాన్ని మోసింది
మగ్గం పేదరికంలో నిగ్గు తేలిన అక్షరం – త్రివేణి నర్సింహ

ఆమెది ‘చిరుగు పాతల బడుగు బతుకుల నేత’ జీవితం. తరతరాలుగా మగ్గం పేదరి కాన్నే అల్లుతోంది. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళేప్పుడు వేళ్ళ మధ్య సందులే కానీ మేతుకులు కనిపించవు – వాటి మధ్య జారిపోతున్న జీవితమే కనిపిస్తుంది. ఇలాంటి దుర్భర దారిద్ర్యంలో నాలుగక్షరాలు మనసుకు పట్టాలంటే శరీరాన్ని ఎంతో కష్ట పెట్టాల్సిందే. అందుకే ఆమె స్పిన్నింగ్ మిల్లో రోజు కూలికి చేరింది. ఆ కూలి డబ్బులతోనే ఇంటర్ పాసయ్యింది దానితో పాటు విద్యావాలంటీర్ ఉద్యోగం సంపాదించింది. అంబేద్కర్ యూనివర్సిటీ వైపు ఆమె వేసిన అడుగు ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎంవీ, ఎంపిల్, పిహెచ్డీలు చకచకా చేయడానికి ఉపయోగపడింది. నిదానంగా ఆమెలో ఉన్న శక్తి అక్షర రూపంలో బయటపడింది. ఆ డిగ్రీ చేతికి వచ్చాక ఆమె కెరీర్ గ్రాఫ్ కూడా మిస్సెయిల్లా దూసుకుపోయింది. కౌన్సెలర్గా, లెక్చరర్గా… తెలంగాణ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎదిగింది. ఆర్థిక భారంలో కూరుకుపోయిన ఆశలను, ఆశయాలను పట్టుదలతో పెళ్ళగించి.. మహిళలు విజయాలను సమాజానికి చూపించాలంటోంది ఇప్పుడామె.

Media Attributions

  • triveni

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.