"

34 అంబెడ్కర్ వర్శిటీ… డిగ్రీ…

చదువుపై ఆసక్తి బాగా ఉండేది. పాలిటెక్నిక్లో నేనే కాలేజీ ఫస్ట్, ఇంకా చదవాలి అన్న ఆలోచనలో ఉండగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి తెలిసింది. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బీకామ్లో చేరాను. ఉద్యోగం చేస్తూ వీకెండ్లో క్లాసులకు అటెండ్ కావడం చాలా అనుకూలమైంది. ఉద్యోగానికి, కుటుంబ బాధ్యతలకు ఇబ్బంది కలగకుండా చదువుకోవచ్చు. ఇది నాకు బాగా కలిసి వచ్చింది. లెక్చరర్లు చాలా సహకరించే వాళ్ళు. సండే క్లాస్లో సమయమే తక్కువ. ఆ సమయంలో ఎలా ప్రిపేర్ కావాలో చెప్పేవాళ్ళు. పాఠాలు చెప్పే తీరు కూడా ఎంతో బావుంటుంది. ఇంకా స్టడీ సెంటర్ల గురించి కూడా చెప్పాలి. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి చాలా స్స్టడీ సెంటర్లు ఉన్నాయి, ఎక్కడైనా చేరవచ్చు. ఒకసెంటర్లో చేరి మరో సెంటర్లో క్లాసులకు అటెండ్ కావచ్చు. నేనలాగే చేసే దాన్ని.అదివారం మా అమ్మ దగ్గరికి వెళ్ళి బాబుని అక్కడ దీంపి అక్కడే క్లాసులకు అటెండయ్యేదాన్ని. దానితో బాబుకూ ఇబ్బంది ఉండేది కాదు. నేను వాళ్ళను కలిసినట్టుగా కూడా ఉండేది. మళ్ళీ సాయంత్రం కూకట్పల్లి వచ్చేదాన్ని. స్టడీ సెంటర్లలో ఉన్న వెసులు బాటు ఇది. డిగ్రీ ఎలా కంప్లీట్ చేయాలి అన్న బాధలే కుండేది. చాలా ఈజీగా గడిచింది. ఫీజులు కూడా చాలా తక్కువ. శనివారం,ఆదివారాల్లో కూడా పరీక్షలు నిర్వహించడంతో ఉద్యోగస్తులు ఎక్కువ సెలవులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా చెబుతూ పోతే ఎన్నో ఉపయోగాలున్నాయి.

ఉద్యోగంలో ప్రమోషన్

ఓ కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో ట్రెయినర్గా పని చేసేదాన్ని, శాలరీ రెండు వేల దాకా ఉండేది. అప్పటికి డిగ్రీ పూర్తి కాలేదు. అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశాక జీతం పెరిగింది. జీవితమూ మారింది. టెక్నికల్ కో-ఆర్డినేటర్గా ప్రమోషన్ వచ్చింది.

అంబెడ్కర్ వర్శిటీ… ఎంబిఎ …

అప్పుడే పెళ్ళయింది. ఇక మళ్ళీ చదువు ఆగిపోయిందనుకున్నా ఎంబీ ఏసెట్ రాశాక అంబేద్కర్ యూనివర్సిటీ సీటు వచ్చింది. చేరాను కానీ వెళ్ళి వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న గొప్ప అనుకూలత… తోమిదేల్డలో ఎప్పుడైనా ఈ కోర్సు పూర్తిచేయవచ్చు. దానివల్ల కట్టిన ఫీజు వేస్తవుతుందనే బాధ లేకుండా తర్వాత కంటిన్యూ చేశాను. ఫస్టియర్, సెకండియర్ రెండూ ఒకే సంవత్సరంలో పూర్తిచేశాను. రెండేళ్ళ గ్యాప్ వచ్చి కుటుంబ పరిస్థితుల వల్ల చదవలేకపోయినా, రెండేళ్ళు వృధా కాకుండా నేను ఎంబీఏ కోర్సు కొనసాగించగలిగాను. అదీ అంబేద్కర్ యూనివర్సిటీ గొప్పతనం. డిగ్రీ అయిపోయాక ‘హెర్ఆర్’ లైన్లోకి వెళ్ళడానికి ఎంబీఏ చేస్తే బావుంటుందనిపించింది. రెగ్యులర్ ఎంబీఏ చేస్తే ఉద్యోగం మానెయ్యాలి. కానీ ఆ పరిస్థితి లేదు. అందుకే అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో జాయిన్ అయ్యాను. నేను కెరీర్ కంటిన్యూ చేస్తూ చదువు కోగలిగాను. ఎంబీఏలో అకౌంట్స్ ఉంటాయి. వాటిని పూర్తి చేసేటప్పుడు అక్కడ లెక్చరర్ల సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఎంబీఏ చేయడం కష్టం అనిపించలేదు. ముఖ్యంగా ప్రాజెక్టు గైడ్ సుధాకర్ గారి వల్ల సునాయాసంగా ఎంబీఏ పూర్తి చేయగలిగాను. ప్రొఫెసర్ కిరణ్మయి మేడం కూడా ఎంతో సహకరించారు. వీరందరినీ ఎప్పుడు కలిసినా ఓపిగ్గా అన్నీ వివరించి చెప్పేవారు.

“ఎంబీఏ రెండు సంవత్సరాలు పూర్తిచేశాక నాకు ‘ఆడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్’ అని అంబేద్కర్ యూనివర్సిటీ వారు సర్టిఫికెట్ ఇచ్చారు. అది బాగా ఉపయోగపడింది. అది పీజీతో సమానం కావడంతో నా కెరీర్ కు ఉపయోగపడింది. అంటే చదువుతున్నప్పుడే కెరీర్ కు ఉపయోగం. దాంతో ‘డెలాయిట్’ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. రిసోర్స్ మానేజ్మెంట్ రిలేటెడ్ ఉద్యోగం, పేరున్న బహుళజాతి సంస్థ అది. కెరీర్ మంచి దారిలో పడింది. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని ఏ సంస్థ భావించలేదు.”

 

‘డెలాయిట్లో’ లోకి …

ఎంబీఏ చేసేటప్పుడు నేను ‘వెర్టెక్స్’ సంస్థలో ట్రైనీ కో-ఆర్డినేటర్గా పనిచేస్తుండేదాన్ని. ఎంబీఏ రెండు సంవత్సరాలు పూర్తిచేశాక నాకు ‘అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్’ అని అంబేద్కర్ యూనివర్సిటీ వారు సర్టిఫికెట్ ఇచ్చారు. అది బాగా ఉపయోగపడింది. అది పీజీతో సమానం కావడంతో నా కార్రేర్ కి బాగా ఉపయోగపడింది. అంటే చదువుతున్నప్పుడే కెరీర్కు ఉపయోగం,దాంతో ‘డెలాయిట్’ సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. రిసోర్స్ మనగ్మేంట్ ఉద్యోగం. పేరున్న బహుళ జాతి సంస్థ అది. కెరీర్ మంచి దారిలో పడింది. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని ఏ సంస్థ భావించలేదు. వాళ్ళకు సర్జిఫికెట్తో పాటు చదువు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. నేను అంబేద్కర్యూనివర్సిటీలో చదువుకుంటూనే పనిచేశాను. కనుక కంపెనీలకు కావాల్సిన అనుభవం కూడా వచ్చింది. పైగా అంబేద్కర్ వర్సిటీ సిలబస్ బావుంటుంది. కనుక సండే షన్కు ధోకా లేదు. ‘ఓపెన్ వర్సిటీలో చేస్తే కెరీర్ బావుండదు’ అనేది అపోహేనని నా కెరీర్ చూస్తే అర్థమవుతుంది.

కెరీర్ కు ఎంతో ఉపయోగం

కెరీర్లో ఈ స్థాయికి వచ్చానంటే… అంబేద్కర్ యూనివర్సిటీ ఆధారంగానేను ‘లైన్’ మార్చుకుని డిగ్రీ, ఎంబీఏ సాధించడమే కారణం. పాలిటెక్నిక్లోనే ఆగిపోయి ఉంటే చాలా తక్కువ జీతానికి, చిన్న ఉద్యోగంతో ఆగిపోవాల్సి వచ్చేది. ఇప్పుడు ట్రైనర్ నుంచి మేనేజర్‌దాకా ఎదగగలిగాను. అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి హెచ్ఆర్లోనే డబుల్ పీజీ చేయవచ్చని విన్నాను. అది చేయాలని ఆలోచిస్తున్నాను.

మనం ఉన్నత లక్షణాలు కలిగిఉంటే సరిపోదు, వాటిని నిలబెట్టుకోవడానికి తగిన సామర్థ్యం కుడా కలిగి ఉండాలి.
– సెయింట్ థెరిస్సా

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.