"

ఆగిపోయిన చదువు నుంచి ఎంబిఎ దాకా – పద్మప్రియ

జీవితం నిరంతర ప్రవాహం. దాన్ని మనకు అనువుగా మార్చు కోగలిగితే అందమైన లోకాన్ని సృస్త్జు ప్రవహించవచ్చు. ఇదే కెరీర్కు వర్తిస్తుంది. మనకు అనుకూలమైనప్పుడు, అవసరమైనప్పుడు కెరీర్ కూడా మార్చుకుని ఎదగగలగాలి – పద్మప్రియ అదే చేసింది. కంప్యూటర్ ట్రైనర్ స్థాయి నుంచి ఐబీఎం మేనేజర్ గా ఎదగడానికి అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఎలా సాయపడిందో ‘పద్మప్రియ’ చెబుతుంది. పాలిటెక్నిచేసి చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్న ఈమె బీకాం, ఎంబీఏ చేసి తన కెరీర్ మార్చుకుంది. పెరుగుతున్న డిగ్రీలతో పాటు హోదానూ, జీతాన్నిపెంచుకున్నారు. కుటుంబ పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్లోనే ఆగిపోయిన చదువుకు అంబేడ్కర్ వర్సిటీ ప్రాణం పోసింది. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కలలుకనే ప్రతిష్ఠాత్మక ‘ఐబీఎం’ సంస్థలో మేనేజర్ స్థాయికి చేర్చింది. బహుళ జాతి సంస్థల్లో పనిచేసే అవకాశాన్ని ఇచ్చింది. అంబేడ్కర్ యూనివర్సిటీతో తన అనుబంధాన్ని, అనుభవాలను, ఉద్యోగంలో తన ప్రగతిని ఇలా వివరిస్తోందామె. మా పేరెంట్స్ది గుంటూరు జిల్లా, కానీ, మేము హైరబాద్లోనే పుట్టి పెరిగాము.

padmapriya
ఆగిపోయిన చదువు నుంచి ఎంబిఎ దాకా – పద్మప్రియ

టెన్త్ దాకా సీబీఎస్ సిలబస్లోనే చదివాను. నాన్నకు ఐసి ఐఎల్లో ఉద్యోగం. అప్పట్లో పాలిటెక్నిక్కు డిమాండ్ ఉండేది. దాంతో టెన్త్ అయిపోగానే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాశాను. టెక్నికల్ కోర్సు కదా ఉద్యోగాలు తొందరగా వస్తాయని పాలిటెక్నిక్ చదివాను. నిజామాబాద్లో హాస్టల్లో ఉంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో పాలిటెక్నిక్లో చేర్పించారు. అది చేశాక ఇంజనీరింగ్ చేయాల్సి ఉండేది కానీ అప్పటికి పరిస్థితులు అనుకూలించలేదు. ఫీజులు అయితే నేమి, ఇంట్లో పరిస్థితులు అయితేనేమి చదువు అక్కడే ఆగిపోయింది. ఉద్యోగంలో చేరాను కానీ జీతం తక్కువ.

Media Attributions

  • padmapriya

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.