చదువు రాసిన సువర్ణ చరిత – గొట్టిపాటి సుజాత

టెన్త్ ఇంగ్లీషులో రెండుసార్లు ఫెయిలైన అమ్మాయి డిగ్రీ ఇంగ్లీషు లిటరేచర్ సబ్జెక్టుతో, ఇంగ్లీషు మీడియంలో చదివి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆటపాటల్లో పడి అంతంత మాత్రపు ఆసక్తితో చదువు మూలనపడి, మూడేళ్ళు ఇంట్లోనే ఉన్న ఈ అమ్మాయి ఇపుడు గవర్నర్, ముఖ్యమంత్రులకు స్వతంత్ర, గణతంత్ర దినోత్సవ ఉపన్యాసాలు రాపిస్తోంది. ఈమెను కదిపితే అక్షరం ఇచ్చిన బలంతో దేశాన్ని, ప్రపంచాన్ని మార్చగలమనే విశ్వాసం మరియు దీనికి పునాది వేసిన అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పై కృతజ్ఞతా కనిపిస్తోంది. టెన్త్ రెండేళ్ళు రెగ్యులర్గా చదివి రెండుసార్లు మూడు సబ్జెక్టుల్లో ఫెయిలైన గొట్టిపాటి సుజాత, అంబేడ్కర్ యూనివర్సిటీలో అడుగుపెట్టి డిగ్రీలో స్టేట్ ఫస్ట్, గోల్డ్మెడల్ సాధించింది. వరుసగా బీసీజే, ఎంపీజే, బిపిఆర్(పబ్లిక్ రిలేషన్స్) అన్నింటిలోనూ ఈమెది ‘సువర్ల’ చరిత్రే. ప్రస్తుతం ఎపిఎస్ఎసిలో డిప్యూటీ డైరెక్టర్ (పీఆర్) గా పనిచేస్తోన్న గొట్టిపాటి సుజాత చదువు వెలుగులివీ.
నాన్న… ప్రయోగాలు
నిజామాబాద్ జిల్లాలోని బీర్చూర్ మాది, నాన్న హెడ్మాస్టర్. నేను థర్డ్ క్లాస్ కొచ్చేసరికే ఆయన డిజైన్ చేశారు. జీవితంలో చాలా ప్రయోగాలు చేశారాయన. వైవిధ్యాన్ని కోరుకునే మనిషి, చలనశీలి. ఆ రోజుల్లోనే వంద ఎకరాల వ్యవసాయం, ఆధునికంగా చేసేవారు. పెద్ద పెద్ద మడులు, పెద్ద కట్టలు. సెంట్రలైజ్డ్ ఇరిగేషన్ సిస్టమ్. దిగుబడి భారీగా ఉండేది. ఉల్లి పండిస్తే ఊర్లో నిల్వచేయడానికి ప్లేస్ దొరికేదికాదు. సహజంగా వ్యవసాయంలో ఉండే సమస్యలతో ఆయన నష్టపోయారు. ఆ తర్వాత భూమి అమ్మేసి గుజరాత్లో సివిల్ వర్క్స్ చేశాడు. అది కూడా భారీ స్థాయిలోనే. పదిమంది ఇంజనీర్లు, కానీ… అక్కడా కూడా దెబ్బతిన్నారు. ఎక్కడ సమస్య వచ్చినా దానికి లొంగే మనిషి కారాయన. వ్యవసాయంలో స్పెషలిస్ట్. చుట్టుపక్కల గ్రామాల్లో పంటలకు సంబంధించి ఏ డౌట్ వచ్చిన ఆయన దగ్గరికే వచ్చేవారు. జీవితంలో భిన్నకోనాలు చూసిన మనిశాయన, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆయన హెడ్మాస్టర్గానే ఉంటే నా చదువు తీరు ఎలా ఉండేదో కానీ ఆయన వేర్వేరు పనులపై ఉండడంతో నా చదువుకు కొంత ఇబ్బంది కలిగింది. నాన్న మాథ్స్ బాగా చెప్పేవారు. ఆయన స్టూడెంట్స్ ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటారు. ఆయన శిష్యరికంలో నేర్చుకుని స్థిరపడిన వారెందరో ఆయనను తలుచుకుంటుంటారు. మా చదువు దగ్గరికి వచ్చేసరికి ఆయన మాపై దృష్టి పెట్టి అవకాశం లేకపోయింది.
Media Attributions
- sujatha