"

27 శృతి చేసిన అక్షర నాదం

థర్డ్ ఇయర్ … అమెరికా కచేరీ

నాకు విదేశాల్లో కూడా కచేరీలు బాగా పెరిగాయి. చాలా బిజీగా ఉండేవాణ్ణి, చదవడానికి సమయం సరిపోయేది కాదు. డిగ్రీలో కాంటాక్టు క్లాసులు అటెందయ్యే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. కాసింత సమయం దొరికినపుడు ఇంట్లోనే చదివేవాణ్ణి. నా భార్య త్రిమూర్తులమ్మ మాత్రం రెగ్యులర్గా క్లాసులకు వెళ్ళేది. తర్వాత మేమిద్దరం సబ్జెక్టులపై చర్చించే వాళ్ళం. ఫస్ట్ మరియు సెకండ ఇయర్ పాస్ అయం పరీక్షలప్పుడు బాగా చదివేవాళ్ళం. కానీ, చివరి సంవత్సరానికీ వచ్చేసరికి పరీక్షల సమయంలో అమెరికాలో కచేరీలు చేయాల్సి వచ్చింది. దాంతో మూడవ సంవత్సరం పూర్తి చేయలేక పోయాను. త్రిమూర్తులమ్మ పరీక్షరాసి డిగ్రీ పూర్తి చేసింది. నా కన్నా ముందే. ఇక ఆ తర్వాత ఎంత బిజీ అయినా డిగ్రీ పూర్తి చేయాలనుకున్నా మూడవ సంవత్సరం కూడా పూర్తిచేశా. ప్రాథమికవిద్య కూడా లేని నాకు అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ లభించింది. చాలా ఆనందకర విషయం. నిజానికి పీజీ కూడా చేయాలనుండేది. అయితే అప్పటికి కాసింత సమయం కూడా దొరక నంత బిజీ. అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఐహ్రెయిన్… ఇలా అనేక దేశాల్లో ఉత్సవాలు, కచేరీలు, ఊవీరి అడనంత బిజీ. త్రిమూర్తులమ్మ మాత్రం చదువు కొనసాగించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ కూడా పూర్తి చేసింది.

ప్రొఫెసర్‌గా…

నా జీవితం సంగీతంతోనే ముడిపడి ఉంది. ప్రాథమిక విద్యార్హత లేని నేను తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్ను అయ్యాను. ఏ రంగంలోనైనా అంతర్భాతీయ ఖ్యాతిపొందిన వారిని ప్రొఫెసర్గా నియమించవచ్చునని యూనివర్సిటీగ్రాంట్ కమిషన్(యూజీసీ)లో ఒక క్లాజ్ ఉంది. దాంతో ఎన్టీరామారావు గారు నన్ను ప్రొఫెసర్గా రమ్మని ఆహ్వానించారు. అయితే అప్పటికే అంబేద్కయూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయడం నాకు ప్రొఫెసర్గా పనిచేసే ఆత్మవిశ్వాసాన్నిఇచ్చింది. డిగ్రీ చదివిన విశ్వాసంలో, విజ్ఞానంతో నేను మృదంగం సజ్జెక్కుకు స్ల్యల్లబుస్ కూడా రాయగలిగాను. 15 ఏళ్ళపాటు డీన్ గా పనిచేసి అనేక కోర్సులు ప్రవేశపెట్టి తెలుగు యూనివర్సిటీ సర్వతోముఖాభి వృద్ధికి కృషి చేయగలిగాను.

“నేను బడికి వెళ్లి సాధారణ విద్యను అభ్యసించింది లేదు. అంబేద్కర్ విశ్వవిద్యాలయమే నా తొలి బడి. అకాడమీ విద్య చేయలేకపోయినా నా సంగీతానుభవంతో, వివిధ దేశాలలో తిరిగి అక్కడ పద్ధతులు గమనించిన అనుభవంతో అనేక కోర్సులను… నా హయాంలో తెలుగు యూనివర్సిటీ ప్రవేశపెట్టాను. విద్యార్థులకు అనేక అవకాశాలు కల్పించాను.”

 

మాదీ సంగీత కుటుంబం…

సరిగమలే ఓనమాలు మాకు. నాకు సంగీతంలోనే అక్షరాభ్యాసం. అదే చదువు. అదే లోకం. సరస్వతి సంగీత రూపంలో మమ్మల్ని కటాక్షించింది. నాముందు నాలుగు తరాలు సంగీతంలో మునిగి తేలిన వారే. మా తాతతరం వారు స్వతంత్ర సమరయోధులు. గాంధీగారి భజనలకు వారు వాక్య సహకారం అందించే వారట. మా నాన్న రామమూర్తిగారు వయోలిన్ విద్వాంసులు. మా పెద్ద తండ్రి సోమన్నగారు మృదంగ నిపుణులు.ఆయన వద్దే నేను గురుకుల పద్ధతిలో సంగీతాన్నిఅభ్యసించాను. ఆయనకు వందల మంది శిష్యలుండే వారు. సోమన్నగారు పాల్హాట్ మడి అయ్యర్ శిష్యులు. పాల్హాట్ మడి అయ్యర్ సంగీత ప్రపంచంలో మేరు శిఖరం. నాకు సంగీతజ్ఞానం జన్మతః వచ్చిందనుకుంటాను. దైవ ప్రసారమది. నేను ఏడేళ్ళ వయస్సులోనే కచేరీ చేశాను. అప్పటి నుంచి మృదంగమే నా జీవితమైంది.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.