"

25 తలెత్తుకుని నిల్చిన పిడికెడు చైతన్యం

వాగులో వరదనై               నన్ను వెక్కిరించారు
వానలో బురదనై               ఉప్పెనే వచ్చినా…
ఎటుతోస్తే అటు               ఊర్లేకొట్టుకుపోయినా
గమ్యం తెలియక                ఈ బతుకు కలపై
వెనుతిరిగే వెర్రిదాన్నని                తలెత్తుకుని నిలిచే
అక్షరాలకు దూరం చేసి                పిడికెడు  చైతన్యాన్ని –

సంసార నావ

సంసార నావ పుట్టి పెరిగిందంతా సికిందరాబాద్లోని లోతుకుంట. నాన్న వ్యవసాయం చేసేవారు. దానితోపాటు ఉప్పర పని, చదువు మా వంశంలో నాతోనే ప్రారంభమయింది. దళిత కుటుంబాలకు మట్టిలోనే కానీ, అక్షరాలలో అనుబంధం తక్కువ. నేను ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే మా తాత నాగరాజు కిచ్చి పెళ్ళి చేశారు. అప్పటికి పెళ్ళంటే ఏమిటో తెలియదు. అలా అత్తగారింట్లో అడుగుపెట్టాను. నాకు చదువు కోవాలనుండేది, కానీ పెళ్ళితో అది ఆగిపోయింది. మా వారికి సైకిల్ షాపు ఉండేది. సైకిళ్ళను అద్దెకు ఇచ్చేవారు. డెవలప్ కాకపోవడంతో“ఆ పని మానేసి టిల్స్”లో కా ఆప్రైక్స్ గేలబ్గా, “జాయిన్” అయ్యాము. జీతం 250 రూపాయలు. ఇది మాకు బొటా బొటీగా సరిపోయేది. మా సంసార నావలోకి మరో ఇద్దరు వచ్చారు. అమ్మాయి వసంత పల్లవి, అబ్బాయి మహిన్… నావ బరువెక్కింది. ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి.

చదువంటే ఇష్టం…

నాకు చిన్నప్పటి నుంచి చదవడం అంటే మహా ఇష్టం. ఏది దొరికితే  అది చదవే దాన్ని
అక్షరం అంటే మహాప్రేమ. మా అమ్మ జానపద గీతాలు బాగా పాడేది. మాది వ్యవసాయ
కుటుంబం కావడంతో నాట్లువేసేదపుడు, కోతలు కోసేటప్పుడు…ఆమె గొంతులోంచి అలవొగ్గా పాటలు ప్రవహించేవి. ఆ జానపదం నా మనసును చుట్టేసింది. నాలోంచి కూడా పాటలు వస్తుండేవి. నేను ఆరో తరగతి నుంచే పాటలు రాసేదాన్ని. ఎవ్వరికీ చూపించేదాన్ని కాదు. సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడే బెన్తో తెలుగు చదివే దాన్ని లిటరేచర్కు సంబంధించి ఏం చదివినా గొప్ప ఆనందంగా ఉండేది. నిజానికి లిటరేచర్ అన్న విషయం నాకు తెలియదు… నా మనసుకు నచ్చిన కథలు. అంతే.

“జీవితం అంతా అంతులేని సంఘర్షణ. చాలాసార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ పిల్లలు, కుటుంబ బంధాలు అడ్డుపడ్డాయి. నిజానికి నేను ఇంత కష్టపడి చదువుకున్నది కూడా పిల్లల కోసమే. నేను చదువుకుంటే… ఆర్ధికంగా స్థిరపడితే పిల్లలను బాగా చదివించవచ్చు. ఈ ఒక్క లక్ష్యంతోనే అక్షరాన్ని దివిటీలా పట్టుకుని కష్టాలను ఈదగలిగాను. ఈ క్రమంలో రైటర్ గా నిలబడగలిగాను.”

 

‘అన్నమ’ టీచర్ …

పెళ్ళయ్యాక చదువుపై నాకు ఉన్న ఇంట్రస్ట్ చూసి మా వారు టెన్త్  పుస్తకాన్నితెచ్చిచ్చారు… పరీక్ష రాయమని. కానీ నేను లెక్కల్లో చాలా పూర్, అలాగే ఇంగ్లీషు కూడా ఇబ్బందే. బిన్త్ పాసవలేదు. చదువుఅగింది. ఆయన సైకిల్ షాప్, నేను గృహిణిగా… అయితే పుస్తకాలు మాత్రం వదల్లేదు. ‘ఆంధ్రభూమి’ విపరీతంగా చదివేదాన్ని. సీరియల్స్, నవలలు అంటే పిచ్చి. అదే తర్వాత నాకు బాగా ఉపయోగపడింది. దీని వెనుక ఒక పిట్ట కథ ఉంది. చిన్నప్పుడు ‘అమ్మ’ టీచర్గా ఉండేది. తను ఇస్ ఫస్ట్ క్లాస్ టీచర్. మేము చాలా పేదవాళ్ళం. జుట్టంతా చెదిరిపోయి… డ్రెస్సులు సరిగ్గా లేకుండా… దళిత కుటుంబం అని వెంటనే తెలిసేది. ఇరగూ పొరుగు మమ్మల్ని దూరం నేటేవారు. ‘అన్నాను’ లీనగ్ నూత్రు, గన, గర్గలో కూచోలెట్టి తినిపించేది. ఆమె నాకు హీరోయిన్ గా కనిపించేది. గొప్పగా అనిపించింది. బుద్ధి తెలిశాక ఆమెలాగా ఎదగాలనుకున్నా. అమెలాగా చదివి టీచర్ కావాలనుకున్నా. బహుశా ఇదే నాకు చదువుపై ప్రేమ, ఇష్టాన్ని కలిగించింది అనుకుంట. అపుడు పడ్డ అక్షర దీకావృక్షాలై ఇప్పుడు నన్ను రచయితని చేశాయి.

 

కుటంబ భారం

ఆర్థిక సమస్యతో కుటుంబం భారం అయింది. నేనే మైనా చేసి సమస్యల్లోంచి బయట
పడాలనుకున్నా తెలంగాణ ప్రాంతంలో అడవారిని పనికి పంపించడానికి ఇష్టపడరు. నేను ఇంట్లో సైట్ చేసి మా వారిని ఒప్పించి 5 రూపాయల రోజు కూలీకి పనిలో చేరాను. అది ప్రగతి వైపు నా తొలి అడుగు. తర్వాత రూ, 7.30 పైసల రోజు కూలీకి మీటర్ ఫ్యాక్టరీలో చేరాను, నాలుగు సంవత్సరాలు చేశాను. ఇంత కష్టపడ్డా ఇద్దరి కష్ట ఫలితం ఆరు వందలు దాటక పోయేది. అమ్మాయి అప్పటికే స్కూలుకు పోతోంది. బాబుకు స్కూలు ఈడు వచ్చింది. నేను ఇంగ్లీషులో ఇబ్బంది పడ్డాను కనుక పిల్లలను ఇంగ్లీషు మీడియం చదివించాలని నా కోరిక. దానికి 1800 రూపాయిలు అడ్మిషన్ ఫీజు కట్టాలి. ఎంతో స్ట్రగుల్, చదువులేక పోవడం
వల్లే రదా ఈ పరిస్థితి… అన్న ఘర్షణ.

అంబేద్కర్  వర్సిటీ… 

డిగ్రీ చదివే వాళ్ళంటే నాకు మహా మక్కువగా ఉండేది. నేనెప్పుడు అక్కడికి చేరతానా అనిపించేది. ఓసారి పేపర్లో అంబేద్కర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ చుస, అసలిలాంటి వన్ని పేపర్ల్లో వస్తాయని తెలియదు. దళిత విద్యార్థులకు చదవడం. రాయడం వస్తే చాలు… డిగ్రీ ఎంట్రన్సు రాయవచ్చని తెల్సుకున్నా, బెన్త్ ఎట్లాగూ గట్టెక్క లేనని తెల్సుకుని డిగ్రీ ఎంట్రన్స్ రాయాలనుకున్నా. బాబును చంకలో వేసుకుని పంజాగుట్టలో అంబేద్కర్ యూనివర్శిటీ ఆఫీసుకు నడిచి వెళ్ళాను. అప్లికేషన్ ఫారమ్ కోసం. అట్లా రెండు సార్లు… రెండు సంవత్సరాలు వెళ్ళాను. రెండుసార్లూ అప్లికేషన్లు అయిపోయాయి అన్నారు. ఆ తర్వాత 1992-93లో ‘ఆగ్రిమ్ కో లెదర్స్’లో ‘పేస్టర్’ పనిలో చేరాను. 400 రూపాయల జీతం. మూడేళ్ళు చేశాను. ప్రమోషన్లు కూడా ఉంటాయి. అంతకు ముందు ప్లాస్టిక్ పేపర్లు కడిగే పని చేశాను. దుర్భరమైన పని అయినా డబ్బులు ఎక్కువ వస్తాయని అక్కడ పని చేసేదాన్ని, హాస్పిటల్లో అయాగా చేశాను. అక్కడా అవమానాలు. ఇలా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అంతులేని ఘర్షణ. ఎలాగైనా చదవాలన్న కోరిక రోజు రోజుకూ పెరుగుతోంది. పేదరికం, అవమానాలు – వాటన్నింటి నుంచీ దూరంగా పోవాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే చదవాలి. మీటర్ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు గోపాల్ గౌడ్ అప్లికేషన్ తెచ్చి ఇచ్చాడు. అదే టర్నింగ్ పాయింట్. ‘ఆగ్రిమ్ కో లెదర్‘లో పనిచేసేటప్పుడు నాతో ఉండే వాళ్ళందరికి చదువుపై ఆసక్తి ఉండేది. అందరం చర్చించే వాళ్ళం. చదువుకు దారి అప్పుడే పడింది. తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాశా. పాసయ్యా. ఇంకేం డిగ్రీలో చేరా. ముదేల్డు తిరిగే సరికి ‘జాజుల గౌరి, బి.ఎ.’ అయ్యాను. గాలిలో తేలిపోయాను. అలౌకిక స్థితి. ఎంతో కష్టపడ్డాను బిఏ పాసవడానికి. రిజర్వేషన్ ఉపయోగపడింది. స్నేహితులు ఫీజులు కట్టారు. కేవలం చదవడమే నా పని. అదే చేశాను. డిగ్రీ పాసయ్యాను. చదివేటప్పుడు ఎన్నో వెక్కిరింతలు. అవమానాలు. వీటిన్నంటికి సమాధానం చెప్పగలిగాను.

నాకు కొంచెం నమ్మక మివ్వు…

డిగ్రీ సెకండియర్లో తెలుగు లిటరేచర్ తీసుకున్నాను, దానిలో నా కిష్టమైన కథలు, కవితలు. మళ్ళీ బాల్యం వచ్చిందన్న మాట. ఎంతో ఇష్టమైన చదువు. తెలుగు లిటరేచర్లో ఉన్న అలూరి బైరాగి రాసిన ‘నాకు కొంచెం నమ్మక మివ్వు..’ కవిత నాకు బాగా నచ్చింది. ఇది నన్ను మార్చిన కవిత. నాలో ఆలోచనలు పోసిన కవిత. నమ్మకాన్ని ఎవరికి ఎవరు ఇవ్వాలి అన్న ప్రశ్నకు నాలోంచి వచ్చిన సమాధానం – ఎవరికి వారే నమ్మకం ఇచ్చుకోవాలి అని. ఇదే నా జీవిత ఫిలాసఫీ అయింది. నా ఘర్షణలు ఎదుర్కోవడానికి ఆలంబన అయింది.  డిగ్రీ సెకండీయర్లో ఉండగా శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో రిసెప్షనిస్టుగా ఉద్యోగం వచ్చింది. కొండలరావు ప్రాప్రయిటర్, ఎడ్యుకేషన్కు సంబంధించి ఎంకరేజ్ చేశారు. ఇంటికి దగ్గర్లో ఉందని చేరాను. మొదట 700 రూపాయిలు ఉన్న జీతం జర్నలిజం పీజీ చేసే వరకు 3500 రూపాయల దాకా చేరింది. డిగ్రీలు పెరుగుతున్న కొద్దీ శాలరీ పెరిగింది. రిజిస్టర్ కౌంటర్లో కూర్చునే చదివేదాన్ని. ఫీజులు కట్టడానికి కొండలరావుగారు సాయం చేసేవారు. ఇదే సమయంలో కథలు, కవితలు రాయడం మొదలు పెట్టాను. పత్రికలకు పంపడం, అవి తిరిగి రావడం. పత్రికలంటే ఒక రకమైన ఫోబియా ఏర్పడింది.

“నీవు కావాలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.”
– రాబర్ట్ ఆంథోని

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.