24 విధినే ఎదిరించిన ధీరత్వం
బాల్యంలోనే భాద్యతలు
అవమానానికి అంత శక్తి ఉంటుందని ఆ క్షణం వరకూ నాకు తెలియదు. ఒకటికాదు, రెండు కాదు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు ఏదో ఒక రూపంలో వెటకారం నన్ను వెంటాడుతూనే వచ్చింది. వరంగల్ జిల్లాపరకాలలో నేను పుట్టాను. మా నాయన అప్పట్లో భూస్వామి. నక్సలైట్లు మాభూమిని ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత మా నాయన తాగుదుకు అలవాటు పడ్డారు. ఏకంగా మద్యానికి బానిసయ్యాడు. పోయేది పోగా మిగిలిన కొద్ది పాటి ఆస్తిని కూడా అమ్మేని మా సోదరి పెళ్ళి చేశారు. కట్టుబట్టలతో మిగిలిన మేము నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం కొత్త పల్లికి మకాం మార్చాం. అప్పుడు నా వయస్సు పన్నెండేళ్ళు. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు కొత్తపల్లి లో చెట్టుకింద చదువులు చెప్పే మాస్టర్ దగ్గర చదువుకున్నాను. నాల్గవ తరగతి నుంచి 7వ తరగతి వరకు వరంగల్ జిల్లా పరకాలలో బీసీ హాస్టల్లో చేరి చదివాను. కానీ ఏడో తరగతి ఫెయిల్ అయ్యాను. మా నాయిన నిరంతరం మద్యం మత్తులో జోగడంతో ఇంటి బాధ్యత నాపై పడింది. నేను తిరిగి కొత్తపల్లి చేరాల్సి వచ్చింది. కొత్తపల్లి నుంచి నందిపేటకు రోజూ ఉదయం పాలు, పెరుగు తీసుకెళ్ళి అమ్మేవాడిని. మధ్యాహ్నం పూట సోడాలు కూడా అమ్మే వాడిని. అలాసంపాదించిన దానితోనే మా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడిని. కొత్తపల్లికి సరైనరవాణా సౌకర్యాలు లేవు. పోయి రావడం కష్టమయ్యేది. దీంతో కొత్తపల్లి నుంచిధర్మారం గ్రామానికి మకాం మార్చాల్సి వచ్చింది. అక్కడికి సమీపంలోని సుద్దపల్లి నుంచి పాలు, పెరుగు తీసుకుని నిజామాబాద్‌కు వెళ్ళి అమ్ముకునేవాడిని. నాకష్టాన్ని గమనించిన మా అమ్మ వేదినేల్డు చన్నీళ్ళలా సహకరించేది. తనకు తెలిసిన వంటలో కమ్మని ఇడ్లీలు చేయడం ఒకటి. మా అమ్మ ఇడ్లీలు చేసి ఇస్తే వాటిని తీసుకెళ్ళి అమ్మేవాడిని. ఇలా రకరకాల పనులు చేసుకుంటూనే 1986-87లో కొత్తపల్లి లోని జడ్పీ హైస్కూల్లో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాను. దురదృష్టం నా నెత్తి మీదనే ఉంది. ఇంగ్లీష్‌లో ఒక్క మార్కుతో ఫెయిలయ్యాను. చుట్టుపక్కల వారి మాటలు మనసును కష్టపెట్టేవి. నీకెందుకురా చదువు అనే వారి వెటకారం పుండుమీద కారం చల్లినట్టు ఉండేది నాకు.
పగలు హోటల్ , రాత్రి సెక్యూరిటీ గార్డు
నలుగురు నవి అవమానపడిన ఊర్లో ఇంకా ఉండలేకపోయాను. ఇంకా మదహపూర్ కి వచ్చే సాను . కోడి పెట్టుబడి తో హోటల్ పెట్టాను. పగలంతా అక్కడ పని. రాత్రి ఓ చాటింగ్ కంపన్య్నిలో సెక్యూరిటీ గార్డ్గ కొని ఎల్దు గాచిచాయి.. నలుగు రాలదు పోగు అయాక ఒక సొంత జీప్ కొన్నాను. దాంతో పాటు ఒక సొంత దిఅరీ కొద. మాలది పల వ్యాపారం కూడా స్టార్ట్ అయింది. అప్పుడు నిజామాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా గిరిధర్ సారు పని చేస్తుండే. ఆయన ఇంటికి నేను రోజూ పాలు తీస్క పోయేవాణ్ణి. అట్లా ఆయన ప్రభావం నాపై బలంగా పడింది. ఆయనను ఆదర్శంగా పెట్టుకున్న నాకు చదువుకోవాలన్న ఆశ మళ్ళీ చిగురించింది. గిరిధర్ సారుతో మాట్లాడే అవకాశం రావడంతో నా మనసు లోని మాటలను చేపన్ను. నా ఆసక్తని గమనించిన ఆ సర్ నన్ను బాగా ప్రోత్సహించారు.
రాజధానికి మకాం…
ఇలా కొన్నేల్డు గడిచాక హైదరాబాదుకు మకాం మార్చాను. ఆ టైములో ఏమి చేయలన దాని పై కచితమైన ప్రణాళిక లేదు. పుట గడవదవడానికి ఆటో నడపాలని నిర్ణయించు కున్నాను. పగలంతా ఆటో అండ్ రాత్రి రెస్ట్. అది నా దినచర్య అయింది. నేను ఉండే గదిలో వారి ద్వారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాను. అక్కడ ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరంలేదని. నేరుగా డిగ్రీ చేసే అవకాసంమ ఉండడంతో నా కోరిక మాలది వ్రిజుమ్బించింది.
అంబేద్కర్ వర్శిటీ …
1991 లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించే ఎంతెరన్స్ పరీక్షా రాసి పాసయ్యాను. నిజామాబాద్‌లోని ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీలోని యూనివర్సిటీ స్టడీ సెంటర్లో డిగ్రీలో చేరాను. 1995లో అత్తెసరు మార్కులతో డిగ్రీ పూర్తిచేశాను. ఇక ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో నాలుగో ర్యాంక్ వచ్చింది. పీజీ కోర్సులో చేరాను, కానీ నాకు పోటీ పరీక్షలు రాసి ఏదైనా ఉద్యోగంలో స్థిరపడాలన్న కోరిక. కలెక్టర్ కావాలన్న కల. దాన్ని చంపుకోలేకపోయాను. కోచింగ్ తీసుకుంటే… ఆలోచన వచ్చిందే తడవుగా పీజీ చేస్తూనే హైదరాబాద్‌లోని ఆర్.సి.రెడ్డి స్టడీ సెంటర్‌కు వెళ్ళాను. అక్కడ వారంతా ఇంగ్లీషులో మాట్లాడించారు. అప్పటికి నాకు ఇంగ్లీష్‌లో క్నోవ్లేగే అసలు లేదు. ఎలాగైనా సివిల్ సర్వీసెస్ రాయాలని, కలెక్టర్ కావాలని కలలు కంటున్న నాకు అక్కడి కెళ్ళాక తెలిసింది అది ఎంత కష్టమైన పనో, అయినా ఆశ దావలేదు. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఏవో కొన్ని పుస్తకాలు కొని ఇంటికెళ్ళాను. స్నేహితులు ఆ పుస్తకాలు చూసి ఎగతాళి చేశారు. నీ ముఖానికి కలెక్టర్ చదువెందుకురా అని బాగా ఆటపట్టించారు. అంతో ఇంతో పట్టుదలగా చదువుకుంటున్న నాకు వారి మాటలు మరింత పట్టుదలను తెప్పించాయి. ఇలా కొన్నాళ్ళు గడిచాక హైదరాబాద్‌కు మకాం మార్చాను. అప్పటికీ ఏం చేయాలన్న దానిపై ఖచ్చితమైన ప్రదాళిక లేవీ నా దగ్గర లేవు. పూట గడవదానికి ఆటో నడపాలని డిసైడ్ చేసుకున్నాను.
కలెక్టర్ కల …
హైదరాబాదు తిరిగి వచ్చిన ఎర్రగడ్డ సదరు కలెక్టర్ కావాలి, సివిల్స్ రాసి తీరాలి, అందులో నెగ్గి తీరాలి అన్న కసితో ప్రిపేర్ అవడం మొదలెట్టాను. ఈ క్రమంలో చాల కంపెట్ట్టివే
ఎగ్జామ్స్ రాశాను. 2001లో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత జూనియర్ లెక్చరర్ పోస్టు కూడా వచ్చింది. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో పోస్టింగ్ నా సంతోషానికి పట్టపగాలు లేవు. సోడాలు, పాలు, ఇడ్లీలు అమ్మిన నేను… నిత్యం అవమానాలు, చిరాకులతో బతికిన నేను.. ఇప్పుడు సమాజంలో ఓ గౌరవనీయమైన వృత్తిలోకి అడుగుపెడుతున్నాను. అసలు ఈ ఊహే నన్ను ఓ క్షణం నిలువనీయలేదు. వెంటనే వెళ్ళి అల్లాదుర్గం జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా చేరిపోయాను.
డిప్యూటీ తహసీల్దారుగా…
లెక్చరర్‌గా పనిచేస్తూనే 1999లో గ్రూప్-II పరీక్ష రాశాను, ఆ తర్వాత గ్రూప్-I కూడా రాశాను. మూడేళ్ళు లెక్చరర్‌గా పనిచేసిన నేను 2004లో గ్రూప్-II ఫలితాల్లో విజయం సాధించి ఇప్పుడు డిప్యూటీ తహసిల్దార్‌గా నాసొంత జిల్లాలో పని చేస్తున్నాను. గ్రామీణ పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను బాల్యం లోన్ కుటుంబ భారాన్నిమోస్తూ, అవమానాల పాలవుతూ అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. పగవారికి కూడా రావద్దనిపించేంత ఇబ్బందులు పడ్డాను. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చునవడానికి నా జీవితం కంటే నిదర్శనం ఏముంటుంది.
ఒక్కమాట …
ఆర్థిక ఇబ్బందుల వల్ల చదవలేక పోతున్నామనుకునే వారికి నేను చెప్పగలిగే మాట ఒకటి. నా జీవితానికో రూపునిచ్చిన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నా లాంటి మరెందరి జీవితాలనో తీర్చిదిద్దింది. ఇంకా దిద్దుతోంది. అధైర్య పడకుండా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేయూతను అందుకోండి. మీ జీవితాల్లోకీ అద్భుతాలను ఆహ్వానించండి.