23 ఆర్ట్ కళాశాలలో చదవాలన్న కోరికా తీరింది….
ఎంపీడి మొదటి సంవత్సరం చదివేటప్పుడు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరి దీర్ఘకాలిక సెలవు పెట్టి ఎంపిడి పూర్తిచేశాను. ఎంపీడి రెండవ సంవత్సరంలో ఉండగా మూడవ పిల్లాడిని కన్నాను. ఎంపీడి పూర్తిచేసిన వెంటనే ఎంఫిల్ చేసే ఛాన్సు లేకపోవడంతో లైబ్రరీ సైన్సెస్ కోర్సులో చేరాను. అలా ఆర్ట్స్ కాలేజీలో చదవాలన్న కోరికను కూడా నెరవేర్చుకున్నాను. ఇది నాకు మరుపురాని అనుభవం. ఎందుకంటే ఈ జన్మకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో చదువుతానని అనుకోలేదు. చదువు మీద నాకున్న ఇష్టానికి ఎన్ని కోర్సులు చేస్తున్నా విసుగు అనిపించేది కాదు, రాను రాను ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అయితే నా విజయాల్లో నేను చేసిన కృషి వెనుక మా వారి ప్రోత్సాహం
రెట్టింపు ఉంది. అది కొరవడి ఉంటే ఈ స్థాయిలో ఉండి “మా అమ్మ నా చదువులు అర్థంకాక
‘ఇప్పుడు ఎన్నో తరగతిలో ఉన్నావు?’ అని తరచూ అడుగుతుండేది. నా వీహెచ్డి డిగ్రీ అమ్మ చేతిలో పెట్టి, డిగ్రీ తీసుకునే రోజు అమ్మ చేత వేదికపై నాలుగు మాటలు మాట్లాడిద్దా మనుకున్నాను. అమ్మకు కూడా నా మనసులో మాట చెప్పాను. కానీ ఆ కోరిక తీరలేదు. హఠాత్తుగా మూత్రపిందాలు చెడిపోయి అమ్మ చనిపోయింది. ఇది నా జీవితంలోని తీరని కోరికగా మిగిలిపోయింది,”. నన్ను చదివించే క్రమంలో నా భర్త ధనుంజయ్కి లండన్ కామబ్రిద్గే విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చింది. నా చదువు కోసం ఆయన ఆ అపురూపమైన అవకాశాన్ని వదులుకున్నారు.
1997లో పీజీ, 1998లో లైబ్రరీ సైన్సెస్ పూర్తయింది. తర్వాత ఉస్మానియాలో ఎంఫిల్ సీటు వచ్చింది. 1999-2000లో ఎంఫిల్ సమర్పించాను. ‘రామాయణ అరణ్యకాండలోని ఆశ్రమాలు -శ్రీరాముడు దర్శించిన ఆశ్రమాలు’ పై పరిశోధన చేశాను. ఎంఫిల్ చేసేటప్పుడు ఉస్మానియా తెలుగుశాఖలో ఎన్టీ మహిళా కోటా కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలు జరిగాయి. అదే కాకుండా డిగ్రీ, జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టులకు ఏపీపీఎస్సీ నుంచి ఎంపికయ్యాను. మెదక్ జిల్లా సదాశివపేట డిగ్రీ కాలేజీలో పోస్టింగ్ వచ్చింది.అదిలాబాద్ జూనియర్ కాలేజీలో వచ్చింది. సదాశివపేటలో 1999 జులైలోచేరాను. కాలేజీ మధ్యాహ్నం ఉండేది. పొద్దున్న పది గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే రాత్రి పది గంటలకు ఇంటికి చేరేదాన్ని అలా ఆరు నెలలు కష్టపడ్డాను. మా పిల్లలు కూడా అప్పుడు నాకు ఎంతగానో సహకరించారు.
తండాకు అండగా ఉండాలని…
ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలక్షయ్యాను. 1999 నవంబరు 30న యూనివర్సిటీలో చేరాను. 2001లో పీహెచ్డీలో చేరాను. మసన చెన్నప్ప నా గైడ్, నల్లగొండ జిల్లా బంజారా సాహిత్యం – జీవన చిత్రాలపై పీహెచ్డీని చేశాను. ఫీల్డు వర్క్లాగా ఉండేది. మా బంజారా భాషే కదా మెటీరియల్ సంపాదించడం కష్టం కాదు అనుకున్నాను. కాని చాలా కష్టమైంది. పైగా మా భాషకు లిపిలేదు. ఓరపుతో వాటిని సేకరించడమే. ఎఫ్ఐపీ కింద రెండు
సంవత్సరాలు సెలవు తీసుకుని ఒకటిన్నర ఏడాదిలో పీహెచ్డి పూర్తి చేశాను. 2006 మేలో పీహెచ్డి పట్టా పొందాను, జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకి దరఖాస్తు పెట్టుకున్నాను. 2007, మే 14న అసోసి యేట్ ప్రొఫెసర్ను అయ్యాను, ఈ నా సుదీర్ఘ విద్యా ప్రయాణం, నేనెంత విజయాన్ని సాధించానో మా గురువులు, ఇతరులు నన్ను మెచ్చుకున్నప్పుడు గాని తెలియలేదు నాకు. అన్నింటికన్నా నాకు ఆనందాన్ని ఇచ్చిన విషయం నన్ను స్ఫూర్తిగా తీసుకుని ఇంటర్ వరకూ చదివిన మా తండాలోని ఎందరో అమ్మాయిలు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేయడం. ఇప్పుడు 37 సంవత్సరాలు నాకు. నా లక్ష్యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బంజారాలపై పరిశోధనకు ఒక ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పాలని, గిరిజన సాహిత్య సాంప్రదాయాలపై కృషి చేయాలని. అంతేకాదు తండా ప్రజలకోసం కూడా ఏదైనా చేయాలని ఉంది. ముఖ్యంగా బాలికల విద్య కోసం.