22 చీకటి తాండాలోంచి వెండి వెన్నెల్లోకి….
చదువంటే ఎంతో ఐష్టం
బాగా చదుకోవాలని చిన్నతనం నుంచీ నాకు ఉండేది. మా తండాలో రెండవ తరగతి వరకే ఉంది. మూడవ తరగతి చదువుకోవాలంటే రూదియ తండాకు పోవాలి, అక్కడ ఐదవ తరగతి వరకూ చదువు చెప్తారు. ఆ తండామాకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. మా అక్కకు అప్పటికి నా ఈదు
కూతురు ఉంది. మా ఇద్దరినీ చదువుకోవడానికి అక్కడికి పంపడానికి అమ్మ భయపడలేదు. నేను, అక్క కూతురు మాజీబాయి ఇద్దరం కలిసి పొద్దున్నే అంతదూరమూ నడిచి వెళ్ళేవాళ్ళం. ఆ తండాకి పోవాలంటే చక్కటి దారిలేదు.మరీకట్ల మీర నుంచి నడుచుకుంటూ పోవాల్సి వచ్చేది.
ఐదవ తరగతి తర్వాత మళ్ళా నా చదువు కొనసాగింపు ప్రశ్నార్థక మైంది.మిర్యాలగూడలో బాలికల ఉన్నత పాఠశాల ఉంది. అక్కడ 6-10వ తరగతి వరకూ బోధిస్తారు. మా ఊర్లోని ప్రసాద్ అనే మాస్టారు నేను బాగా చదువుతానని, ఎలాంటి పరిస్థితుల్లో నన్ను చదివించడం మాన్పించవద్దని మా ఇంటికివచ్చి మరీ అమ్మకు చెప్పారు. సార మాటలతో నన్ను మిర్యాలగూడలోని పాఠశాలకి పంపించడానికి అమ్మ సిద్ధపడింది. నేను, మాజీబాయి ఇద్దరం అక్కడ చేరాం. మిర్యాలగూడ హైస్కూలు చేరుకోవాలంటే మా తండా నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. అప్పుడు అక్కడికి బస్సుల రాకపోకలూ ఉండేవి కావు. రోడ్లూ కొడా లేని ఐ పాఠశాలకు నేను, మాజీ ఇద్దరం తండా నుంచి కొన్నాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. ఒక నెల తర్వాత అనుకుంటా మిర్యాలగూడ ఎన్సీ హాస్టల్లో మాకు సీటు వచ్చింది. (అప్పటికి అక్కడ మాకు ఎస్టీ హాస్టలు లేదు.) నేను హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఉచిత విద్యాబోధన కావడంతో ఇంట్లో వాళ్ళు చదువు ఆపించేస్తా రేమోనన్న భయం, మానసిక ఒత్తిడులు కూడా పోయాయి.
ఇంటర్ లో ఉండగా పెళ్లి …
చివరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసే నాటికి ధనుంజయ్తో పెళ్ళి నిశ్చయించారు. నేను పెళ్ళి చేసుకోను, చదువుకుంటా నంటూ ఏడ్చాను. అమ్మ ధనుంజయ్ దగ్గరి నుంచి నన్ను చదివిస్తానన్న మాట తీస్కుంది. అందుకే పెళ్ళి నిశ్చయించాను అని నాకు సర్దిచెప్పింది. 1987లో మా పెళ్ళి అయింది. పెళ్ళికిముందు ఇచ్చిన తన మాటకు ఆయన ఎంతగా కట్టుబడి ఉన్నారన్న దానికి నేను అక్కడ చదువుకునేటప్పుడు ప్రతి వారాం నేను, మాజీ ఇంటికి వెళ్ళి వస్తుండేవాళ్ళం. అప్పుడు ఇంట్లో వాళ్ళు మాకు పొలం పనులు, మట్టి ఎత్తమనడం, చెత్త ఏరమనడం, నాల్లేయమనడం చెప్పే వారు. నేను, మాజీబాయి ఆ పనులు చేయమని ఒకటే
ఏడ్చేవాళ్ళం. చదువుకుంటాం అనే వాళ్ళం. మాకప్పుడు ఎంతసేపూ చదువు మీదే ధ్యాన ఉండేది. మా మనసు గ్రహించిన అమ్మ ‘వాళ్ళని వదిలేయండి. వాళ్ళకేం పనులూ చెప్పొద్దు’ అని ఆదేశాలిచ్చింది. అప్పటినుంచీ ఇంట్లో వాళ్ళు మా ఇద్దరికీ పనులు చెప్పడం మానేసి మమ్మల్ని హాయిగా వదిలేశారు. మొత్తానికి విజయవంతంగా నేను, మాజీబాయి పదవ తరగతి పాసయ్యాం. భల్లూనాయక్ తండాలో పదవ తరగతి వరకు చదివి, పాసైన ‘ఇద్దరమ్మాయిలు’గా మేం అక్కడ చరిత్ర సృష్టించాం.. పెళ్ళికి ముందు ఇచ్చిన తన మాటకు ఆయన ఎంతగా కట్టుబడి ఉన్నారన్నదానికి నేను కెరీర్ పరంగా సాధించిన ఈ ‘పొజిషనే’ నిదర్శనం.” ఆనందం మాటల్లో చెప్పలేం. మళ్ళా ప్రసార్ సార్ మాటతోనే అమ్మా వాళ్ళు
మిర్యాలగూడ కళాశాలలో నన్ను ఇంటర్ ప్రైవేనీలో చేర్పించారు. తాను మాటల మనిషిని కాదని, చేతల వ్యక్తినని ‘అక్షరాలా’ నిజం చేసి చూపిం చారాయన. ఎమ్మెన్సీ జియోలజీ చేసి ఆయన కమ ర్షియల్ టాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు.
ఇంటర్ రెండవ సంవత్సరంలో నేను గర్భవతిని కావడంతో థియరీ పరీక్షలు రాయలేకపోయాను. ఇంటర్ చదువుకు అలా గండి పడింది. 1988లో బాబు పుట్టాడు. 1989లో మా వారు నా చేత అందే ద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశ పరీక్ష రాయించారు. ఇది నా జీవితాన్ని మలుపు తిప్పింది. ప్రవేశ పరీక్షకు అవసరమైన మెటీరియల్ అంతా ఆయన తెచ్చిపెట్టారు. నేను ఈ ప్రవేశ పరీక్ష రాస్తున్న విషయం మటుకు స్నేహితులెవ్వరికీ తెలియనివ్వద్ద న్నాను. అందులో అర్హత పొందలేకపోతే అవమానమని అలా చేశాను. కాని ఆ
ప్రవేశ పరీక్ష రోజే మా ఇంటికి ఆయన స్నేహితులు వచ్చారు. వాళ్ళందరికీ నేను పరీక్ష రాస్తున్నట్టు తెలిసిపోయింది. పైగా ఆ రోజు మా ఇంటి నిండా బంధువులు కూడా ఉన్నారు. మరొకవైపు పిల్లాడి గురించి ఆలోచన. వీటి మధ్యనే ఆ ఎంట్రన్స్ పరీక్షకు హాజరయ్యాను.
ఇల్లు , పిల్లల బాద్యత మధ్యనే…
* పరీక్ష రాయడానికి వచ్చిన వాళ్ళు ఎన్నోసారి నేను ప్రవేశ పరీక్షరాస్తున్నానంటూ అడిగారు, జీకే పేపరు చాలా కష్టంగా ఉంటుందన్నారు. సిటీలో ఉండేవాళ్ళేకే ఈ పరీక్ష కష్టంగా ఉంటుందను కుంటే పల్లెటూరి అమ్మాయిని, అందులో తండా నుంచి వచ్చిన నేను పరీక్ష ఏం రాయగలనన్న సందేహం కలిగింది. కాని వారందరూ భయపడిన జీకే, నేను బాగా రాశాను. ఇదంటే నాకు భయం లేకపోవడానికి కారణం మా వారు గ్రూప్-1కి సిద్ధమయ్యేటప్పుడు నేనుకూడా ఆయనతో పాటు జీకే పుస్తకాలను బాగా చదివేదానిని. రోజూ పేపర్లు చూసేదాన్ని. వీటికి తోడు మా ఇంటికి వచ్చే ఆయన స్నేహితులు. వల్డు చేసే రాజకీయ చర్చలను కూడా వంటంట్లో వంట చేసుకుంటూ వినేదాన్ని. ఇవన్నీ జీకే పరీక్షరాయడానికి నాకు ఉపయోగపడ్డాయి. కాని ఇంగ్లీష అంతేనా కొద్దిగా భయం. మొత్తానికి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షబాగానే రాశాననిపించింది. తర్వాత ఆ విషయం మరచిపోయాను కూడా. ప్రవేశ పరీక్షలో అర్హత పొందాను. ఈ జయం నాలో ఆత్మవిశ్వాస బీజాలు నాతిండి. పిల్లలు, బంధువులు, ఇంటి పనుల మధ్యే డిగ్రీలన్నీ పూర్తిచేశాను.
డిగ్రీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, పొలిటికల్ సైన్సెస్ తీసుకున్నాను. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపట్ల మొదటి నుంచీ నాలో ఆసక్తి ఎక్కువ. అందుకే వీటిని ఎంచుకున్నాను. 1990లో ఇందులో చేరాను. 20 ఏళ్ళకే ఇద్దరు పిల్లలు నాకు. పిల్లల బాధ్యతలతో ఓపెన్ యూనివర్సిటీ క్లాసికి వెళ్ళింది లేదు. ఇంటి పనులతో చదవలేక పరీక్ష రాయనని ఏడ్చాను. కాని ఆయన ‘మోడల్ పేపరైనా తెలుస్తుంది కదా’ అని పంపారు. నాకు కావాల్సిన మెటీరియల్ ఎప్పటికప్పుడు అందిస్తూ చదువులో బ్రేక్ రాకుండా చూశారు. చివరకు అలాగే పరీక్షలకు హాజరయ్యాను. అప్పటికి పాప కూడా పుట్టింది. పిల్లల్ని ఇంట్లో వదిలి పరీక్ష రాయలేకపోయేదాన్ని. వాళ్ళ చుట్టూ మనసు కొట్టుకునేది. అందుకని మా వారు నా తోపాటు వచ్చి పరీక్ష అయ్యేవరకూ అక్కడే ఉండి వాళ్ళని అడించేవారు. చివరి పరీక్ష రోజు పాపకు మీజిల్స్ వచ్చి ఒక పేపరు రాయలేకపోయాను. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రెండు సంవత్సరాల పేపర్లు కలిపి ఒకేసారి రాసి అన్ని పేపర్లు పాసయ్యాను. ఈ ఒత్తిదుల మధ్యనే టైపు కూడా నేర్చుకున్నాను. టైపు ఇన్స్టిట్యూట్కు నాతోపాటు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళే దానిని, వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను టైప్ నేర్చుకునే దానిని.
నాతో పిల్లల్ని తీసికెడుతూ ఎంఏ రెగ్యులర్ గా చేశాను….
1990లో డిగ్రీలో చేరితే 1994లో పూర్తయింది. ఓపెన్ యూనివర్సిటీ వేసిన పునాదితో బీఈడీ ప్రవేశపరీక్షరాశాను. సీటు వచ్చింది. ఆంధ్ర మహిళా సభలో చేరాను. దాని పూర్తి చేశాను. బీఈడీ ఇంగ్లీషు మీడియం బోధనంతా ఇంగ్లీషులోనే ఉండేది. నాకు మొదట్నించీ ఇంగ్లీషు సమస్య. అందుకని మా వారు వాటికి సంబంధించిన తెలుగు మెటీరియల్ని సేకరించి నాకు అందించారు. పరీక్షలు తెలుగులో రాసే సౌలభ్యం ఉండేది. 1995లో బీఈడీ పూర్తయింది. తర్వాత ఎంఏ రెగ్యులర్ చేయమన్నారాయన. తెలుగు, సోషియాలజీ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు పెట్టుకున్నాను. పరీక్షలూ రాశాను. సోషియాలజీలో అర్హత పొందాను. ఎంఏ తెలుగు సీటు కూడా వచ్చింది. తెలుగు సబ్జెక్టుపై నాకు విపరీతమైన ఆసక్తి ఏర్పడడానికి కారణం నేను చదువుకున్న బడిలోని మా టీచర్లే. 1996లో తెలుగు ఎంఏ కోఠి ఉమెన్స్ కాలేజీలో చేరాను. నాతోపాటు పిల్లల్ని కూడా కాలేజీకి తీసుకెళ్ళే దానిని. పిల్లలిద్దరూ అప్పుడు ఎల్కేజీ, యూకేజీలు చదువుతున్నారు. సరిగ్గా అప్పుడే డీఎస్సీ ప్రకటన పడింది. ఆ పరీక్ష రాశాను. జనరల్లోనే అర్హత పొందాను. పెద్ద అంబర్పేట జడ్పీ హెచ్ఎస్లో పోస్టింగ్ ఇచ్చారు, ఏడు, ఎనిమిది తరగతులకు సైన్స్ పాఠాలు చెప్పే దానిని, అప్పటికే అక్కడ సీనియర్ తెలుగు రీచర్ తెలుగు సబ్జెక్టును చెబుతుండ డంతో నేను సైన్స్ క్లాసులు తీసుకోవాల్సి వచ్చింది. బైపీసీ విద్యార్థినిని కాబట్టి పాఠాలు బాగానే చెప్పగలిగాను. బీఎడ్ చేస్తున్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గ్రూప్-1 ఫ్రీకోచింగ్ క్లాసులకు కూడా వెళ్ళేదాన్ని. నా నాలెడ్జ్ను మెరుగుపరచుకోవడానికి,చదివే పద్ధతులను మరింత పదును పెట్టుకోవడానికి ఈ కోచింగ్ చాలా ఉపయోగపడింది.