"

చీకటి తాండాలోంచి వెండి వెన్నెల్లోకి – సూర్య ధనుంజయ్ నాయక్

చీకటి తాండాలోంచి వెండి వెన్నెల్లోకి – సూర్య ధనుంజయ్ నాయక్

ఆమె మట్టిలోంచి వచ్చిన మాణిక్యం, చీకటి తండాలో ఉదయించిన సూర్యతేజం, తెలుగు బాషతోషతో సంబంధమే లేని బంజారా కుటుంబంలో పుట్టి – ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలిగా ఎదిగిన ఈమె విజయగాథకు డా. బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయమే మూలవేదిక. నల్లగొండ జిల్లాలోని ఒక మారుమూల గిరిజన తండా నుంచి వచ్చిన సూర్యాదనుజై నాయక్ విజయం వెనుక వెన్నుతట్టి ఆడపిల్లను చదివించిన అమ్మ ఆదర్శం ఉంది. అంతకు మించి వేలుపట్టి చదువుల లోగిళ్ళలో నడిపించిన భర్త సహకారమూ ఉంది. ఓపెన్ యూనివర్సిటీ నుంచి బిఏ, ఎంఫిల్, పీహెచ్డీలు పూర్తిచేసి, తన సుదిర్గ విద్యాయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకున్న సూర్య ఇవాళ తండా యువతులకు గొప్ప స్ఫూర్తి. తెలంగాణ లంబాడీల్లో తెలుగులో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఎదిగిన తొలి బంజారా అధ్యాపకురాలు ఆమె. ఎన్ని ‘రోజరాజు మెట్లు’ రాడితే… సూర్యా ఈ తేజోమయ విజయాన్ని సొంతం చేసుకుందో తెలియాలంటే ఆ విజయగాదను ఆమె నోటి నుంచే విందాం.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ‘జప్తి వీరప్పగూడెం’ గ్రామంలోని ‘భల్లూనాయక్ తండా’ మాది. చాలా మారుమూల తండా. అమ్మ ధ్వాళీబాయి, నాన్నభల్లూనాయక్. మాది వ్యవసాయ కుటుంబం. బాగా దతికి చెడిన వాళ్ళమని అమ్మ ఎప్పుడూ అంటుండేది. మేం పదిమంది సంతానం. ఏడుగురు అక్కాచెల్లెళ్ళం. ముగ్గురు అన్నదమ్ములం. నేను తొమ్మిరవ దానిని. నాకు మూడేళ్ళ వయసు ఉన్నప్పుడను కుంటా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే అన్నీతానై మమ్మల్నందరినీ పెంచి పెద్ద చేసింది. వ్యవసాయ పనులు కూడా తనేచేసేది. పెద్దక్కని ఇల్లరికం ఇచ్చి పెళ్ళి చేసింది. మా అన్నయ్యలు చదువుకోవదానికి వెళ్ళిపోయారు. ఇంట్లో అక్కే అమ్మ తర్వాత అమ్మలా మా కుటుంబానికి అండగా నిలబడింది.

Media Attributions

  • surya dhanunjay

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.