21 శ్రీకృష్ణ మాస్టారు పరిచయం…
శ్రీకృష్ణ మాస్టారు పరిచయం పుస్తక పరనాన్ని మరికొంత పెంచింది. ఆయన సిద్ధార్థ కాలేజీలో అధ్యాపకులు. అమ్మ, అమృతం కురిసిన రాత్రి, వేదాలలో ఏమున్నది? నిత్యజీవితంలో భౌతికశాస్త్రం … ఇలాంటి వైవిధ్యమైన పుస్తకాలూ ఇచ్చేవారు. ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉండకూడదని, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పే మాస్టారు నా దృక్పధంలో మార్పుకు కారణం అయ్యారు. న్యూనతలో పాతరేసిన నా వ్యక్తిత్వం చిగురు తొడగడం ప్రారంభించింది. దానికి తోడు సి.నరసింహారావు ‘రేపు’ మాస పత్రిక నన్ను ప్రభావితం చేసింది. ఆత్మవిశ్వాసాన్ని , వ్యక్తిత్వాన్ని పాదుకొల్పింది.
అమ్మ, ఆశలు….
తమ్ముళ్ళు ముగ్గురూ ఫస్ట్ క్లాస్ విద్యార్థులు. నాన్న నన్ను చదివించలేక వదిలేశారు. నాన్న నా గురించి ఎంతో బాధపడేవారు. అమ్మకేమో మేము వాళ్ళ అన్నయ్యల్లా తయారవ్వాలని కోరిక. మా మేనమామల్లో ఒకరు ఇంజనీర్, మరొకరు డాక్టరు. మేము ఎదగడానికి అమ్మ ఎంతో శ్రమ పదేది. దురదృష్టవశాత్తు అమ్మ ఆలోచనలకు అనుగుణంగా పరుగెత్తే శక్తి నాకు లేకపోయింది. మా డాక్టరు మామ సలహా మేరకు నాన్న నాకు మూడు చక్రాల బండి కొన్నారు. దాంతో బాహ్య ప్రపంచానికి దారులు తెరచుకున్నాయి. చక్రాల సాయంతో నేను బయట అడుగుపెట్టాను. ఖాళీగా ఉండలేక నాన్నగారి స్నేహితుడి వద్ద ఎలక్రీషియన్ పని నేర్చుకున్నాను. అక్కడ పనికి కుదిరాను. నెలకు ఇరవై రూపాయల జీతం. ఆ డబ్బుతో ‘చిత్రసూత్ర’ అనే కరస్పాండన్స్ కోర్సులో జాయిన్ అయ్యాను. చిత్రలేఖనం అంటే ఆసక్తి ఉండేది. తర్వాత అది కొనసాగించడానికి డబ్బులు సరిపోయేవి కావు. తమ్ముళ్ళ చదువుల కోసం కష్టపడుతున్న అమ్మా నాన్నలను డబ్బులు అడగాలనిపించేది కాదు. దానితో చిత్రలేఖనం మూలన పడింది. వచ్చిన జీతంతో పాత పుస్తకాలు కొనేవాడిని. ఎప్పటికైనా హోం లైబ్రరీ ఏర్పాటుచేసుకోవాలన్న కోర్కకకు అప్పుడే పునాది పడింది.
24వ ఏటా డిగ్రీలో ….
ఒక రోజు రెండో తమ్ముడు రమణ “నువ్వు బిఏ ఎందుకు రాయకూడదు” అన్నాడు. అంబేద్కర్ యూనివర్సిటీ గురించి చెప్పాడు. కానీ,నేను ఒప్పుకోలేదు. నా వల్ల అవుతుందా అన్న అనుమానం, పరీక్షలంటే బయం, దానితో నేను రాయనన్నాను. “నీకు నాలెడ్జ్ ఉంది. నువ్వు బిఏ చదవగలవు, తప్పకుండా డిగ్రీ చేయాలి. లేకపోతే నువ్వు సంపాదించిన విజ్ఞానానికి విలువ ఉండదు” అని నన్ను రమణ ప్రోత్సహించాడు. రమణ మాటలతో నేను 24వఏట అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులో చేరాను. పరీక్షల టైమ్కుకి ఢిల్లీ నుంచి వచ్చాడు. పరీక్ష రాస్తున్నంత సేపూ కాలేజీ వద్దే ఉండేవాడు. అది చాలా మనోధైర్యాన్ని ఇచ్చింది. నేను పరీక్ష బాగా రాశానంటే తాను పాసయినంతగా ఆనందించేవాడు. అది చూసి మరో నాలుగు పరీక్షలు రాసే శక్తి వచ్చేది. మూడు సంవత్సరాలు గడిచాయి. బిఏ సెకండ్ క్లాస్లోపాసయ్యాను. ఇది నాలో నింపిన ఆత్మవిశ్వాసం ఎంతని చెప్పను? పొలిటికల్సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్… ఇవీ నా సబ్జెక్టులు. మా కోఆర్డినేట రఘునాథ్ గారి సహాయం మరిచిపోలేనిది. నా కోసం పైఅంతస్థులోని క్లాసులను కిందకు రింపేవారు. అలాగే డిగ్రీ కూడా నడచి నా దగ్గరికి వచ్చింది.
ఇంగ్లిష్ పై విజయం…
ఎంట్రన్స్ పాసై డిగ్రీలో చేరాను. కాని, ఇంగ్లీషు సమస్య ఎదురయ్యింది.ఇంగ్లీషు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ‘నీకెందుకు…’ అనే వాళ్ళు. ప్రతి విషయంలో ఇదే ప్రశ్న నన్ను దుకపరిచేది. దానితో ఇతరులను అడగడం మానేశాను. కానీ డిగ్రీ గట్టెక్కాలంటే తప్పదు. అందుకే సెయింట్ రీటాస్ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్కు వెళ్ళాను. ప్ప్రిన్సిప్లె సెస్ లాంబర్డ్. ఆమె ఆంగ్లో ఇండియన్. ఇంగ్లీషు పట్ల నా ఆసక్తి గమనించి ఫీజు లేకుండా, నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పాఠాలు చెప్పింది. ఆమెకు తెలుగురాదు. నాకు ఇంగ్లీషు రాదు. కానీ మూడు నెలల్లో ఇంగ్లీషు రాయడం,చదవడం నేర్చుకున్నాను. ఇంగ్లీషు ఆమె పెట్టిన భిక్షేనని చెప్పాలి. వాత్సల్యపూర్వకమైన సహకారం అది.
పూర్తయిన డిగ్రీ ..
చెప్పాగా… పరీక్షలంటే భయం. డిగ్రీ మొదట సంవత్సరం పరీక్షలు దగ్గరపడుతుంటే గుండె దడగా ఉండేది. అది గమనించి మూడో తమ్ముడు రవి ఢిల్లీ నించి వచాడు. నేను పరీక్షా రాసినంత వరకు కాలేజీ వార్డ్ లో ఉండేవాడు. ఆటను ఉండడం వల్ల మరో మూడు పరిక్షలు రాసే శక్తి కొద వచెది. మూడు సంవస్తారాలు గడిచాయ్. నేను బిఎ సెకండ్ క్లాస్ లో పాస్ ఆయన్ను.
అది పునర్జన్మ…
అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ నాకు పునర్జన్మ నిచ్చింది. వికలాంగుడిగా ఆత్మ న్యూనతలో కొట్టుకుని పోతున్న నన్ను లేపి నిల్చోబెట్టింది. వైకల్యంతో ప్రకృతి నన్ను నిమ్నపరిస్తే.. నా విద్యావకాశాలను కొల్లగొడితే యూనివర్సిటీ వీటిని తిరిగి నా దగ్గరికి చేర్చింది. నేను డిగ్రీలో చేరినప్పుడు ‘ఈ చదువు ఉపయోగపడుతుందా…’ అని పెదవి విరిచారు. కానీ, ఏ ఇంటర్వ్యూలోనూ నాకా ప్రశ్న ఎదురు కాలేదు. డిగ్రీ తర్వాత రచనా వ్యాసంగంపై ఆసక్తితో అంబేద్కర్ యూనివర్సిటీలోనే రైటింగ్ ఫర్ మాస్ మీడియా“లో వీజీ డిప్లొమోచేశాను. పత్రి ఆఫీస పై అంతస్థుల్లో ఉన్నాయి. అందుకే నా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. ఎస్టీడీ బూత్ పెట్టాను. కానీ, సెల్ ఫోన్ నా రాతమార్చేసింది. ఎస్టీడీ బూత్ మూతపడింది. ఇప్పుడు జీవనోపాధి కోసం ఓ చిన్నవ్యాపారం చేస్తున్నాను. హాబీగా అప్పుడప్పుడు పత్రికలకు వ్యాసాలు రాస్తున్నాను.కథలు పంపుతుంటాను. అయినా… అందరిలా నీకెందుకు అని ప్రశ్నించకుండా నన్ను అక్కున చేర్చుకుని నాలోని ఆత్మన్యూనతను పారదోలిన అంబేద్కర్ యూనివర్సిటీని ఎలా మర్చిపోగలను.