ఆత్మవిశ్వాసమే ఆయన ఆయుధం – రాజేంద్రప్రసాద్

“ఈ రోజు నేను విజేతను కాకపోవచ్చు. భవిష్యత్తును జయించగల ఆత్మవిశ్వాసం ఉంది – దాని వెనుక నేను శ్రమించి నేర్చిన విద్య, విజ్ఞానాలున్నాయి.”
‘కాళ్ళు తడవకుండా జీవితాన్ని దాటడం _’ కష్టమంటారు. కానీ, కాళ్ళు లేకుండా జీవితంతో పోరాటం ఎంత దుర్భరమో రాజేంద్రప్రసాద్కు తెల్సు పోలియో మహమ్మారి చిన్నప్పుడే కాళ్ళను తీసుకుంది. ఆటలు, పాటలు, చదువు సంధ్యలతో పరుగెత్తే ప్రపంచం అతన్ని ఒంటరిగా ఇంట్లో వడిలేసినది _ ఏం ప్రయత్నం చేసివా ‘నా కెందుకు _’ అన్న ప్రశ్న అతనిలో నిరుత్సాహాన్ని, న్సున్యతను మిగిల్చింది… కదలలేని జీవితంలోంచి నిరాశను పారద్రోలడానికి అతను పుస్తకాలను ఆశ్రయించాడు. కనపడిన ప్రతి కాగితం అతనికి అపురూపంగా కనిపించింది… చిన్నప్పుడే దూరమైన చదువును అంబేద్కర్ యూనివర్సిటీ దగ్గర చేసింది. డిగ్రీ సాయంతో రాజేంద్రప్రసాద్ ఆత్మ విశ్వసాని పొందాడు. కొత్త వెలుగులను ఆహ్వానించాడు. శ్రీకృష్ణ మాస్టారు ఆలోచనలు, సి.వరసింహారావు ‘రేపు’ పత్రిక, ఆంగ్లో ఇండియన్ లాంబర్ట్ ఇంగ్లీషు పాఠాలు ఇవన్నీ అతనికి కొత్త జీవితం చిగురులు తొడగడానికి సాయపడ్డాయి. ప్రకృతి పాదాలను హరిస్తే, బడికి దూరం చేస్తే అతను అక్షరాల మీద నడచి ప్రకృతినే వెక్కిరించగలిగాడు. ఇదీ రాజేంద్రప్రసాద్ సక్సెస్ స్టోరీ…
పోలియో కాటు …
మాది దళిత కుటుంబం. అమ్మ శ్యామల, నాన్న రోమెనిల్. పశ్చిమగోదావరి జిల్లాలోని జగన్నారపురం మాది. ఐటీఐ చదివిన నాన్న హైదరాబాద్లో ఆల్విన్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. పోలియో వ్యాధిపై అవగాహనలేక వ్యాక్సిన్ చేయించలేదు. అదే నా జీవితాన్ని కాటేసింది. రెండు కాళ్ళు చచ్చుబడి పోయాయి. నడక నా జీవితం నుంచి తొలగిపోయింది. కొన్ని విషయాలు తెలియకపోవడం ఎంత విషాదాని మిగులుస్తాయో నాకు అనుభవంలోకి వచ్చింది. అందుకే నాలో ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలన్న అసక్తీ, కోరికాపెరిగాయి.
Media Attributions
- rajendraprasad