"

17 చదువుతో వచ్చిన సదవకాశం…..

టెన్త్…. పెళ్లి ….

ఎనిమిదవ తరగతిలో మ్యాథమ్యాటిక్స్ టీచర్ లేరు. టీచర్ లేకుంటే ఏం చదువుతామని ఫ్రెండ్స్తో, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, టీసీలు తీసుకుని వెస్ట్ మారేడ్పల్లిలోని స్కూలుకు అడ్మిషన్ కోసం వెళ్ళాం. పేరెంట్స్ లేకుండానే. మేమే ఐదారు గురు పిల్లలం ‘గాంగ్’ లాగా వెళ్ళాం. ఆ స్కూలు వాళ్ళు షాక్. చిన్నపిల్లలే అడ్మిషన్ల కోసం రావడం ఏమిటని, పైగా అందరం అమ్మాయిలం.సెయింట్ జాన్స్ స్కూల్ కమ్ కాలేజీ అది. ఆ సంఘటన అప్పుడొక న్యూస్ అయింది. అక్కడా చదువు అంతంత మాత్రమే. అటెండెన్స్ చాలా తక్కువ. క్లాసులు ఎగ్గొట్టి కాలేజీ అమ్మాయిలతో కలిసి పాటలు పాడడం. టీచర్లకు మస్కకొట్టి ఆటలు. అలా టెన్త్ దాకా చదువు సాగింది. టెన్త్ రిజల్డ్ రాకముందే పెళ్ళయిపోయింది.

మా ఆయన… చదవు… 

మా ఆయన లాగా చదువుకున్న వారు. బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం చేస్తుండేవారు. చదువంటే ఆయనకు మహా ఇష్టం. ఈ విషయంలో మా ఇద్దరికీ పొంతనలేదు. పెళ్ళయిన కొత్తలో ఓ సారి అడిగారు. ‘టెన్త్ దాకా వచ్చావు కదా! ఇంకా చదువుకుంటావా’ అని. నేనేదో ‘క్యాజువల్‘గా సరేనన్నాను. దీన్ని ఆయన ‘సేరియస్‘గా తీసుకున్నారు. ఇంటర్ పుస్తకాలు తీసుకు వచ్చారు. నాకు గుండె అగినంత పసయ్యింది. టెన్త్తో చదువు గొడవ వదిలిందను కున్నాను కానీ, మళ్ళీ చదువు సమస్య, ఆయన కేమో భార్య బాగా చదువుకోవాలని కోరిక. అయనెప్పుడూ పుస్తకాల మధ్యే ఉండేవారు. నాకు ఏం చదువురా బాబూ! అనిపించేది.ఈ మధ్యలో పిల్లలు పుట్టారు. నాకు చదువు నుంచి కొంత వెసులుబాటు దొరికింది. చదువు ఒత్తిడి తగ్గింది. ఆయన వదల్లేదు. మధ్యమధ్యలో గుర్తు చేస్తూనే ఉన్నారు. ఏం మాట్లాడినా చదువు రిలేటెదే. ఆయన జ్ఞానానికి, నా జ్ఞానానికి పొంతన కుదరడం లేదు. ఆయన ఎంపీ ఎంఫిల్. నేను టెన్త్. ఎక్కడ కుదురుతుంది. నాకు ఇల్లు, సంసారమే పని అయిపోయింది. అది కూడా బోర్కొకొట్టడం మొదలయ్యింది? ఆయన ఒత్తిడి వలన కూడా అయుండచు. కానీ ఎప్పుడూ ఉండే బాధ్యతల నుంచి కొంచెం రిలాక్సేషన్ కోసం అయితే నేమి చదువుకోవడమే మార్గంగా తోచింది.

” ఆ రోజు రిజల్ట్స్ లో నా నెంబర్ చూస్తే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం. అడ్మిషన్ సమయంలో ఉస్మానియా ఉద్యోగులు ఆర్చర్యపోయారు. ‘ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసి ఉస్మానియాలో రెగ్యులర్ సీట్ సాధించావా..’ అని, అక్కడ స్టాఫ్ అందరికీ ఈ విషయం చెప్పారు కూడా . అందరు నన్ను అభినందించారు.”

 

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ… డిగ్రీ 

వికారాబాద్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సెంటర్ మొడలుయ్యింది. మా ఆయన డిగ్రీ ఎంట్రెన్స్ టెస్ట్ రాస్తావా అని అడిగారు. నేను ‘ఓకే’ అన్నాను. టెస్ట్ రాయడం, పాసవ్వడం అయిపోయింది. అది చాలా గొప్పగా అనిపించింది. పిల్లల అలనా పాలనా, మా ఆయన అవసరాలు చూసుకుంటూనే ఇది పాసవడం చాలా ఆనందంగా అనిపించింది. మా ఆయన ఫ్రెండ్ ‘వెంకటయ్య’ గారు ఓపెన్ యూనివర్సిటీలో పని చేసేవారు. ఆయన ‘కీస్ హైస్కూల్ సెంటర్ తీసుకొమ్మని సలహా ఇచ్చారు. “హైదరాబాద్కు వచ్చి క్లాస్ అటెండ్ అవమనండి. డౌట్స్ ఉంటే నాకు ఫోన్చేస్తే నేను చెబుతాను’ అన్నారు. నా చదువు విషయంలో ఆయన బాగా ఎంకరేజ్ చేశారు, తర్వాత హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయి వచ్చాం.

పిల్లలు, పంట, ఇంటి పనులు, వాటి మధ్య చదువు చాల కష్టమైపోయింది. ఒక్కోసారి వంట చేస్తూనే చదివేదాన్ని. దిండు కింద పుస్తకం పెట్టుకుని ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు చదవడం. ఒక రకమైన పని, చదువు లేకపోతే వేస్ట్. గుర్తింపు ఉండదు. మీ అవిద ఏం చదువుకుంది అని అందరూ ఆయనను అడిగేవారు, ఇక దానితో ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయాలనుకున్నాను. వెంకటయ్య గారు బ్రీఫింగ్ చేసేవారు. అది బాగా ఉపయోగపడింది. అలా బీఏ అయిపోయింది. కష్టపడి చదివి పాసయ్యానని మా సర్కిల్లో గుర్తింపు వచ్చింది నాకు, పిల్లలకు ఇబ్బంది లేకుండా ఎంత వరకు అయిన చదువుకో” అన్నారు మా ఆయన. దాంతో ఇంకా చదవాలనుకున్నాను.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.