15 పాన్ షాప్ నుండీ వోల్వో మేనేజర్ గా
బొగ్గుగని లో నాన్న…
మేము నలుగురం అన్నదమ్ములం, ఒక సోదరి. నాన్న బొగ్గు గని లొ జీవితాన్ని, ఆరోగ్యాన్ని కరిగించుకుంటే వచ్చే ఆదాయం నెలకు 120 రూపాయలు. దానితో ఇల్లు గడవడమే కష్టమయ్యేది. ఇక చదువుల సంగతి చెప్పేదేముంది? అందరం అదే జీతంతో చదవడం సాధ్యమయ్యే పనికాదని గోడావరిఖనిలోని ఒక థియేటర్ దగ్గర పాన్ షాప్ తెరిచాం. నాన్న ఉద్యోగానికి వెళ్తాడు కనుక షాపు చూసుకునే అవకాశం లేదు. అందుకే నేను, తమ్ముడు పాన్ షాప్ చూసుకునే వాళ్ళం. అప్పటికి నా వయస్సు పదమూడు సంవత్సరాలు. సాధారణజీవనం గడవడమే ఎంత కష్టమో అంత లేత వయసులోనే తెలిసి వచ్చింది. అలా కూడగట్టిన పైసా, పైసా ఇల్లు గడపడానికి ఉపయోగపడేది. పనిభారం చదువుపై దృష్టి పెట్టనిచ్చేది కాదు. అయినా నా మనసులో ముద్రపడిన లక్ష్యం- చదువుకోవడం.
నాన్నకు అనారోగ్యం…
అతి కష్టంమీద టెన్త్ పూర్తి చేయగలిగాను. అది గట్టికిగలిగానంటే చదువుపై నాకున్న అమితమైన ఆసక్తికారణం. అది కొంచెం సడలినా చదువుకు దూరమైనేను ఇంకా అక్కడే ఉండే వాడినేమో. ఇంటర్లో చేరాక ఆర్థిక ఇబ్బందులతో పాటు మరో పెను సమస్య ఎదురయ్యింది. ఇంటికి ఆధారమైన నాన్న అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆర్నెల్లూ మంచంలోనే. అప్పుడు నేను సెకండియర్‌లో ఉన్నాను. ఇంటర్ మీడియట్త తరుర్వాత హైదరాబాద్ వెళ్ళి సైచదువులు చదవాలని ఉండేది. కానీ, నాన్న ఆరోగ్యంతో పాటు కుటుంబ యొక్కఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఇంటర్ పూర్తయ్యాక సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండిపోయాను. నాకు చేతానైనది చేసి అమ్మ నాన్నకు అండగా ఉండాలనుకున్నాను. వారికి సాయంగా ఉండడంతో పాటు నేను నా లక్ష్యాన్ని మరవలేదు. హైదరాబాద్‌లో చదవడానికి కొంత పొదుపు చేయగలిగాను.
హైదరాబాదుకు…
మంచంలో ఉన్నంతకాలం ఎవ్వరి ముఖంలో ఆనందం లేదు. ఆయన లేచి ఉద్యోగానికి వెళ్తుండడంతో ఇంటికి మళ్ళీ కళ వచ్చింది. కానీ, ఇంతకుముందులా రెగ్యులర్‌గా ఉద్యోగానికి వెళ్ళలేకపోయేవారు. ఆయన చేసే ఉద్యోగానికి మంచిశారీరక ఆరోగ్యం ఉండడం ఎంతో అవసరం. నేను హైదరాబాద్వెళ్ళి చదువుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాను. నేను దాచుకున్న కొంత డబ్బుతో హైదరాబాద్ బయలుదేరాను. అమ్మా నాన్నకు ఆసరాగా తమ్ముడు పాన్షాప నడుపుతూ అక్కడే ఉండిపోయాడు. నేను చదువు పూర్తికాగానే ఉద్యోగంచేసి వారికి అండగా ఉండాలని కున్నాను.
ఉద్యోగపర్వం…
ఆటోమొబైల్‌లో ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఒక్కనెల కూడా ఖాళీగా ఉండలేదు. వెంటనే ఒక ప్రైవేటుకంపెనీలో చేరిపోయాను. అది మా చెల్లి, తమ్ముళ్ళ చదువుకు ఉపయోగపడింది. ఒక సిమెంట్ ప్లాంట్‌లో ట్రెయినీ ఇంజనీర్ గా ఉద్యోగం రావడంతో వారి పైచదువులకు ధోకా లేకుండా పోయింది.
చెల్లి, తమ్ముళ్ల చదువు
పూర్తయిన డిగ్రీ ఉద్యోగాన్ని ఇచ్చింది కానీ, సంతృప్తిని ఇవ్వలేదు. ఇంకా చదవాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. కానీ ఉద్యోగం మానేస్తే ఆర్థిక పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. చెల్లీ, తమ్ముళ్ళ చదువులకు వస్తునారు, వాల్డ చదువులకు ఆటంకం కలుగుతుంది. అందుకే నేను చదవడం కోసం ఉద్యోగం మానేసే సాహసం చేయలేదు. ఉద్యోగం చేస్తూ చదువుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను, ఈ మధ్యలో కెరీర్ గ్రాఫ్ పెరుగుతోంది. మూడేళ్ళు పూర్తయ్యేసరికి బిర్లా గ్రూపు కంపెనీలో కస్టమర్ సపోర్ట్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. సీనియర్ల సహకారంతో గోదావరి ఖనికి దేప్యూటీషనపై వెళ్ళ గలిగాను. అక్కడ పని చేస్తుందగానే పెళ్ళయింది. బాబు పుట్టాడు. 1991లో నాన్నకు ప్రమాదం సంభవించింది. దానితో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దానిలో మా కుటుంబ భారం మొత్తం నాపైనే పడింది. నేనొక్కడినే సంపాదించేది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా చెల్లీ, తమ్ముళ్ళను చదివించడం మాత్రం ఆపలేదు. చదువెంత ముఖ్యమో తెలిసే సంఘటనలు చిన్నప్పుడే మనసులో నాటుకున్నాయి. ఇక చదువు లక్ష్యం నుంచి దృష్టి మరల్చలేదు. ఎంకుకంటే చదువే మార్గం జేవితం మారడానికి.