"

4 ప్రింటింగ్ టెక్నాలజీ…

నా ఇబ్బందిని గమనించి నాన్న, చిన్నాన్న చదువు విషయంలో నాపై ఒత్తిడి చేయగూడదని, మరో దారి ఆలోచించాలన్న నిర్ణయానికి వచ్చారు. నాన్నకు పుస్తకాలు రాయడం, అచ్చువేయించడం అలవాటు. దాంతో ఇంటర్ ఫెయిలయ్యాక విజయవాడకు పంపించి ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా చేయించారు. అప్పటికే నేను ఇంటర్తో నాకు సంబంధం లేరనుకున్నాను. ప్రింటింగ్ రంగంలో వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చింది. డిప్లొమా అయిపోగానే హిందూపురంలో శ్రీవాణి ప్రింటర్స్ పేరిట ప్రెస్ ప్రారంభించాను. దాదాపు మూడేళ్ళు నడిపాను. అప్పటికే ఆఫ్సెట్ ప్రింటింగ్ వస్తోంది. నేను ప్రారంభించింది లెటర్ ప్రెస్. వ్యాపారం సరిగా నడవలేదు, అది మూసేయడానికి నాన్న ఒప్పుకునే వారు కాదు. దాదాపు లక్ష రూపాయలు పెట్టి ప్రెస్ ప్రారంభించాం. ప్రతినెలా నష్టాలు వచ్చేవి. ఒకసారి ప్రెస్ పర్నర్లకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు తక్కువైతే వారీకూడా తాకట్టు పెట్టాను. ఇక వ్యాపారం అదుపు తప్పుతున్నదని అర్థం అయింది. అప్పుడు కాలువ శ్రీనివాస్… ఈనాడు రిపోర్టర్గా పనిచేసేవారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఆయన నా ప్రెస్కు వచ్చి అచ్చు పనులు చేయించుకునేవారు. మా ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరిగింది. ఆయన ధైర్యాన్నిచ్చేవారు. అప్పు డప్పుడు ఆర్థిక సాయం కూడాచేశారు. మొత్తం మీద రిపోర్టర్లకు నా ప్రెస్ కేరాఫ్ అడ్రస్ అయింది. అన్నిపేపర్ల రిపోర్టర్లు వచ్చేవారు… నేను కూడా లేపాక్షి కంట్రిబ్యూటర్గా ఈనాడులోచేరాను. ఆ తర్వాత నష్టాలతో ప్రెస్ నడపడం సాధ్యం కాలేదు. ప్రెస్ అమ్మేశాను.అది రెండో ఫెయిల్యూర్.

“ఆ రాత్రి ప్రెస్ మూసేసి వస్తోంటే ఫ్యామిలీ ఫ్రెండ్ సంపత్  కనిపించాడు. అతనికి నా పరిస్థితి
అంతా తెల్సు. చదువు సమస్య, ప్రింటింగ్ నష్టాలు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరం వచ్చి ‘ఎదురీత’ సినిమాకు పోయాం. ఆ సినిమాలో హీరో పేరు కూడా ‘మధు’యే. “ఎదురీతకు అంతం లేదా..” అన్న పాట వస్తోంది. ఇక దుఃఖం ఆగలేదు. ఒక్కసారిగా ఏడుపు ఎగదన్నుకు వచ్చింది. ఇది చూసి సంపత్… ఎందుకేడుస్తావ్, నష్టాలు ఎవరికైనా వస్తాయి అంటూ ఓదార్చాడు.”

ఆత్మహత్యాయత్నం

ఆర్థిక స్థితి టూ వీలర్ నుంచి సైకిల్ రాకా వచ్చింది. మా సర్కిల్ నుంచిదూరం కావడం, సమాజం నుంచి వెలేసినట్టు కావడం… చదువు రాదు, దేనికీ పనికిరాడు, తెగిన గాలిపటం, ఎటుపోతాడో తెలియదు – ఇలాంటి పరిస్థితి. మిగతా వారికి, నాకు తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ నన్ను ఆత్మ హత్యా యత్నానికి పురికొల్పాయి. ప్రింటింగ్ ప్రెస్ను అమ్మేయాలని అనుకున్నప్పుడు… ప్రెస్ అమ్మితే వచ్చే నష్టాన్ని మదనపల్లెలో వర్కర్గా చేరి పూరించాలనుకున్నా, మదనపల్లిలోని ప్రింటింగ్ ప్రెస్లో మాట్లాడుతున్నా ఇంట్లో చెప్పకుండా వెళ్ళామనుకున్నా మళ్ళీ ఇంట్లోవాళ్ళు పట్టేసుకుంటారేమోనని మానేశా. చదువు లేదు. చదువు రావట్లేదు. చేస్తున్న ప్రింటింగ్ వ్యాపారం సరిగ్గా నడపలేకపోతున్నా బంధువుల్లో నా తోటి వారందరూ బాగా చదువుకుంటున్నారు. డిగ్రీలు, పీజీలు… ఒక వరుసక్రమంలో కెరీర్ ఒక క్రమంలో నడుస్తోంది. నేను ఇంటర్లోనే ఆగిపోయాను. ఈ న్యూనత మనసును కమ్మేస్తోంది. ప్రింటింగ్ వ్యాపారం కొనసాగించే శక్తి, అవకాశం లేకుండా పోతోంది. చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రెస్ అమ్ముతామంటే నాన్న ఒప్పుకోవడం లేదు. మా ఇద్దరి మధ్య గ్యాప్ వస్తోంది. ఆత్మహత్య సైకి మనసు మరలింది. అమ్మకు లెటర్ రాసి పెట్టి… గార్డినల్ మాత్రలు జేబులో వేసుకున్నాను. ఆ రాత్రి ప్రెస్ మూసేసి వస్తోంటే ఫ్యామిలీ ఫ్రెండ్ సంపత్ కనిపించాడు. అతనికి నా పరిస్థితి అంతా తెల్సు. చదువు సమస్య, ప్రింటింగ్ నష్టాలు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఇద్దరం వచ్చి ‘ఎదురీత’ సినిమాకు పోయాం. ఆ సినిమాలో హీరో పేరు కూడా ‘మధు’యే. “ఎదురీతకు అంతం లేదా..” అన్న పాట వస్తోంది. ఇక దుఃఖం ఆగలేదు. ఒక్కసారిగా ఏడుపు ఎగదన్నుకువచ్చింది. ఇది చూసి సంపత్… ఎందుకేడుస్తావ్, నష్టాలు ఎవరికైనా వస్తాయి అంటూ ఓదార్చాడు. ఆ తర్వాత మాటల్లో నేను ఆత్మహత్యా ప్రయత్నం చేయబోతున్నానని గమనించాడు. జేబులో మాత్రలు లాగేసుకున్నాడు. ఇంటికి వెళ్ళి లెటర్ తెచ్చేయమన్నాడు. అట్లా ఆత్మహత్య ప్రయత్నం నుంచి బయటపడ్డాను.

 

 

 

 

License

Icon for the Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License

మేముసైతం... Copyright © 2009 by డా ఘంటా చక్రపాణి is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License, except where otherwise noted.