అంబేద్కర్ బడి నుంచి మీడియా ఒడిలోకి – మధు
ఇంగ్లీషు మీడియం చదువు మధుకు అవమానాన్ని మిగిల్చింది. శాస్త్రాలు, పురాణాలు పుక్కిట పట్టిన అష్టావదాని, తెలుగు లెక్చరర్ కొడుకు
ఇంటర్ ఫెయిలయ్యాడు. ‘పండిత పుత్రుడు_’ అనిపించుకున్నాడన్న ఎగతాళి అతన్ని దహించి వేసింది. తోటి వారు కెరీర్లో చకచకా ఎదుగు
తున్న తీరు, తనతో పనిచేస్తున్న వారి విద్యార్హతలు, తనలో చదువులేమి అతనికి న్యూనతను పెంచింది. చదువు మార్గం వదిలేసి ఎంచుకున్న
ముద్రణా రంగం నష్టాలు తెచ్చిపెట్టింది. ఆత్మహత్యా ప్రయత్నానికి పురిగొల్పింది. ఇన్ని చేదు అనుభవాల్లోంచి, అవమానాల్లోంచి బయటపడిన
ఆయన ఇప్పుడు లబ్ధప్రతిష్టుడైన జర్నలిస్ట్. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ డిగ్రీ సాయంతో మళ్ళీ చదువుల ఒడికి చేరారు. బీసీజే, ఎంపీజే, పీజీ _
గోల్డ్ మెడల్ – తాను ఏమి సాధించినా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో వేసిన మొదటి అడుగే కారణం అంటారాయన. ‘ఈనాడు’ కంట్రిబ్యూటర్
నుంచి రాత్రి కమ్యూనికేషన్ పీఈఓ రాకా ఎదిగిన ఆయన ప్రతి అడుగులోనూ విద్యార్హత అవసరం ఏమిటో తెలిసిందంటారు. అంబేద్కర్
యూనివర్సిటీ తనకు విద్యార్హతలే కాదు, అనేక జీవితానుభవాల్ని దగ్గర చేసిందంటున్న మధుసూదన్ అక్షర యానం ఇదీ…