Introduction
This book contents are from a open course developed as part of OE4BW 2025 project.
Why This Book is Needed ?
The course design titled “Creating Accessible Interactive OER with H5P for STEM Educators in Bilingual (English and Telugu Languages)“ is thoughtfully designed based on insights from a needs assessment survey involving STEM teachers and educators from schools, colleges, and universities. The survey revealed a high level of interest in Open Educational Resources (OER), alongside varying levels of awareness and comfort with digital content creation. This course is needed because many STEM educators in schools, colleges, and universities are interested in using Open Educational Resources (OER) but face significant challenges such as limited awareness, lack of technical skills, time constraints, and difficulty finding subject-specific materials. In response, the course structure addresses these needs by providing foundational knowledge of OER and Creative Commons, practical training in creating interactive content using H5P, and guidance on ethical AI use in content development. Delivered bilingually in English and Telugu, the course enhances accessibility and inclusivity, ensuring educators from diverse linguistic backgrounds can participate effectively. With a focus on hands-on practice, reflection, and impact evaluation, the course empowers STEM educators across different educational levels to create, adapt, and share high-quality interactive OER tailored to their specific teaching contexts.
The course is entirely online and spans 40 learning hours. It integrates bilingual instruction to enhance accessibility and reach. Learners engage in diverse activities such as reading, watching, discussing, practising and producing content, aligned with clear outcomes like defining, applying, analyzing and reflecting. Notably, the course emphasizes accessibility, ethical AI use, and impact measurement of created content, reinforcing its relevance for inclusive STEM education. The course design offers flexibility and practical engagement, making it a robust blueprint for educators aiming to integrate open, interactive and inclusive resources into their teaching practices.
Upon completing this course, participants will possess the skills to create and develop accessible, engaging, and interactive Open Educational Resources (OER) for STEM disciplines using H5P tools. Moreover, participants will acquire skills in utilising AI-driven technologies for effective and innovative content creation, including text generation, quizzes, translations, and interactive media. They will be prepared to remix and repurpose existing Open Educational Resources, incorporate accessible features, and cater to the diverse needs of various learners, including individuals with disabilities. This course enables educators to develop inclusive, egalitarian, and technology-enhanced learning environments using open, digital, and AI-driven pedagogies.
By empowering educators with these skills, the course supports the creation of inclusive, high-quality, and multilingual OERs, which are essential for India’s diverse learning population.
1. ఈ కోర్సు రూపకల్పనకు ప్రేరేపించిన అంశాలు
“Creating Accessible Interactive OER with H5P for STEM Educators in Bilingual (English and Telugu Languages)” అనే శీర్షికతో రూపొందించబడిన ఈ కోర్సు, పాఠశాలలు, కళాశాలలు, మరియు విశ్వవిద్యాలయాలలోని STEM ఉపాధ్యాయులు మరియు విద్యావేత్తలతో నిర్వహించిన అవసరాల విశ్లేషణ (needs assessment survey) ఆధారంగా జాగ్రత్తగా రూపొందించబడింది.
ఈ సర్వేలో Open Educational Resources (OER) పై ఆసక్తి ఉన్నప్పటికీ, డిజిటల్ కంటెంట్ సృష్టి విషయంలో అవగాహన, నైపుణ్య లోపాలు, సమయాభావం, విషయ ఆధారిత మెటీరియల్‌ను వెతకడంలో ఇబ్బందులు వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు తేలింది. ఈ కోర్సు రూపక్ల్పన కు ప్రేరేపించిన అంశాలు:
- OER మరియు Creative Commons పై ప్రాథమిక అవగాహన
- సమగ్రత, సమానత ను దృష్టిలో ఉంచుకుని, H5P ద్వారా అందరికీ అందుబాటులో ఉండే ఇంటరాక్టివ్ కంటెంట్‌ను సృష్టించడంలో అనుభవాత్మక శిక్షణ
- కంటెంట్ అభివృద్ధిలో నైతిక AI (కృత్రిమ మేథ) వినియోగంపై మార్గనిర్దేశనం
ఈ కోర్సు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషల్లో అందించబడటం వలన, భాషా అవరోధాలను అధిగమించి, సమగ్రతను కల్పిస్తుంది. అటు ఇంగ్లీషు మాధ్యమంలో చదివే వారు, ఇటు తెలుగు మాధ్యమంలోని వారు కూడా ఈ కోర్సును సులభంగా అర్థం చేసుకుని, సమర్థవంతంగా పాల్గొనగలుగుతారు.
ఈ కోర్సు మొత్తం 40 లెర్నింగ్ గంటల వ్యవధిలో పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. అభ్యాసకులు వివిధ రకాల ఇంటరాక్టివ్ కార్యకలాపాల ద్వారా పాల్గొంటారు. ఇందులో:
- పాఠ్యాంశాలను చదవడం
- వీడియోల వీక్షణ
- చర్చల్లో పాల్గొనడం
- అభ్యాసాత్మక కార్యక్రమాలు
- కంటెంట్ తయారీ (content creation) వంటి విభిన్న అధ్యయన శైలులు భాగంగా ఉంటాయి. ఈ శిక్షణ ప్రాముఖ్యంగా అభ్యాసం, ఆలోచన, మరియు ప్రభావం మదింపు (impact evaluation) పట్ల దృష్టిని కేంద్రీకరించుతుంది. అలాగే మరింత ముఖ్యమైన ఈ కింది విషయాలనుసైతం ఈ కోర్సులో అందించాము.
- బోధనా కార్యకలాపాలను అందరికీ అందుబాటులో ఉంచడం (Accessibility) అంటే భిన్న సామర్థ్యాలు, భాషలు మరియు పరిసరాల నుండి వచ్చిన అన్ని రకాల విద్యార్థులకు విద్యా వనరులు సులభంగా అందుబాటులో ఉండేలా చేయడం.
- AI వినియోగంలో నైతికత పాటించడం (Ethical Use of AI): కంటెంట్ అభివృద్ధి ప్రక్రియలో **కృత్రిమ మేధస్సు (AI)**ను బాధ్యతాయుతంగా, పారదర్శకంగా మరియు నైతికంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని గుర్తించడమూ, దానిపై అవగాహన పెంపొందించడమూ ఈ కోర్సులో ప్రధాన భాగంగా ఉంటాయి.
ఈ కోర్సు , టెక్నాలజీ ఆధారిత బోధన వాతావరణంలో సమగ్రత, సమానతకు అవకాశం కల్పిస్తూ తమతమ బోధన పద్ధతుల్లో భిన్న భాషలు, సామాజిక, భౌగోళిక నేపథ్యం కలిగిన విద్యార్థుల కోసం నాణ్యమైన OERలు రూపొందించే సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా ఉపాధ్యాయులకు సహాయపడగలదు.
- H5P వినియోగించి ఆకర్షణీయమైన, ఇంటరాక్టివ్ OER (Open Educational Resources) తయారు చేయగలగడం
- AI (కృత్రిమ మేథ) సాయంతో ఇంటరాక్టివ్ మీడియా సృష్టించడం
- ఓపెన్ లైసెన్స్ విధి విధానాలను అర్థం చేసుకుంటూ OERలను పునర్వినియోగించుకోవడం (రిమిక్స్ చేయడం, రిపర్పస్ చేయడం (అంటే బోధనా పద్ధతులకు అనుగుణంగా మలచడం))
- విభిన్న అవసరాలున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విద్యాననరులను రూపొందించే సామర్థ్యం పెంపొందించుకోవడం
YOU CAN VIEW / COPY / DOWNLOAD entire text of this book from a google doc too!
https://docs.google.com/document/d/e/2PACX-1vSjtlEaI6cw_un9l7F0q46hsrZyihvb-X80jUQukLcfjdiSGJuZQsz0xjaDjbGPqzlNhiShQm0juxaO/pub
This course is released with CC BY SA 4.0 License except where otherwise noted.
Please attribute facilitators and feel free to reuse the course modules.
If you want to adapt or adopt please write to course facilitators expressing your interest. (sushumnarao@gmail.com, drkishore@braou.ac.in)