7 Is using AI cheating: What are the teachers’ reactions?
Here you can read about ‘What is AI?, Is using AI cheating: What are the teachers’ reactions?, Leveraging AI for Content Creation (OER for STEM education) and Ethical practices. ఇక్కడ కృత్రిమ మేథ (AI) అంటే ఏమిటి? AIని ఉపయోగించడం నైతిక పరంగా సమంజసమా: ఉపాధ్యాయుల ప్రతిస్పందన ఏమిటి?
నైతికత తో STEM OER కోసం (AI) కృత్రిమ మేథని ఉపయోగించడం వంటి అంశాలపై వివరాలు ఉన్నాయి.
Access the video transcript.
Is using AI cheating: What are the teachers’ reactions? by AI4Teachers is licensed under CC BY 4.0
Here is Telugu gist of the above video:-
పై వీడియోకు సారాంశాత్మకమైన తెలుగు అనువాదం
కృత్రిమ మేధస్సును ఉపయోగించడం మోసం చేయడమేనా? దీనిపై ఉపాధ్యాయుల స్పందనలేంటి?
విద్యారంగంలో కొంతకాలంగా, Photomath మరియు ఆటోమేటిక్ అనువాద సాధనాలు ఉపయోగంలో ఉన్నాయి. పిల్లలు, విద్యార్థులు తమ హోంవర్క్ చేయడానికి లేదా తాము చేయాల్సిన పనిని చేసేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు. ఇది చూసిన ఉపాధ్యాయుల స్పందనలు ఎలా ఉన్నాయి? కొంతసేపు ఆలోచించండి — మీ స్పందన ఏంటి? మీరు ఇదివరకు ఎలా స్పందించారు? ఇప్పుడు ఏమనుకుంటున్నారు?
సాధారణంగా చర్చా గుంపులలో కనిపించే ఉపాధ్యాయుల స్పందనలు ఇవే:
-
అత్యంత ప్రతికూల స్పందన: “విద్యార్థి నేర్చుకోవాలనుకోకపోతే ఇది తల్లిదండ్రుల లేదా సమాజ సమస్యగా భావించడం. కానీ ఉపాధ్యాయునిగా ఇది సిఫార్సు చేయదగ్గ ధోరణి కాదు.
-
హెచ్చరిక ఇవ్వడం: పరీక్షల రోజున AI సాధనాలు ఉండవని విద్యార్థులను హెచ్చరించడం. ఇది ఉపయోగపడినా, దీని ద్వారా పరీక్షలకోసమే నేర్చుకోవాలి అన్న అర్థం వస్తుంది, కానీ నిజమైన విద్యలో అది ప్రధాన ఉద్దేశం కాదు.
-
నైతికంగా తప్పు అని భావించడం: “Photomath వంటివి తప్పు, వాడడం తప్పు” అని చెప్పడం. కానీ విద్యార్థి దృష్టిలో, చుట్టూ ఉన్నవారు (తల్లిదండ్రులు, సోదరులు) వీటిని వాడుతున్నప్పుడు, నైతికంగా తప్పు అనే భావన ఆ విద్యార్థికి విరుద్ధంగా అనిపించవచ్చు.
-
మోసం గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకోవడం: ఉపాధ్యాయులు డిటెక్టివ్‌ల్లా మారడం, విద్యార్థి సమర్పించిన వర్క్ లో ఎప్పుడు, ఎక్కడ, ఎలా మోసం జరిగిందో కనుగొనడానికి యత్నించడం. దీన్ని ఆసరాగా తీసుకుని మోసం గుర్తించే సాధనాలను మార్కెట్లో సొమ్ముచేసుకుంటున్నాయి అనడం అతిశయోక్తి కాదు కదా! అయితే, AI కి ప్రశ్నలు వేయడం ద్వారా ఉపాధ్యాయులు అభ్యాసాన్ని మెరుగుపరచడం చేయవచ్చు: AI సాధనాలు మీ ప్రశ్నలకు ఎలా స్పందిస్తాయో చూసి, ప్రత్యక్ష సమాధానం రాకుండా ప్రశ్నల రూపాన్ని మార్చడం. అలాగే విద్యార్థులను AI సాధనాలు వాడి వాటి స్పందనపై స్పందించడమనడం చేయవచ్చు కదా! ఇక AIని బోధనలో భాగంగా మార్చడం: AI సాధనాలను బోధనలో చేర్చి, వాటితోపాటు భాషలు నేర్పడం. ఇలాంటివి వాస్తవిక పద్ధతులు, ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉంటాయి.
ముఖ్యమైన కొన్ని విషయాలు:
-
ప్రతి చోటా ఆయా పరిస్థితులు, విద్యావ్యవస్థను అనుసరించి AI వాడకం పై కొన్ని నిర్దేశించిన నియమాలు ఉన్నాయి, ఇవి వేగంగా మారుతుంటాయి.
-
ఈ టెక్నాలజీలు పనిచేయవు అని భ్రమలో ఉండకండి. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం.
-
మోసం గుర్తించగలవని చెప్పే ఎన్నో సాధనాలు ఉంటాయి, కానీ ఇవి ఇప్పటికీ పూర్తిగా నమ్మకంగా పనిచేయకపోవచ్చు.
మనం అందరం కూడా ఈ సాధనాలను ఎలా ఉపయోగించాలో, వాటితో ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవాలి.